ఇటీవల టెలికాం పరిశ్రమలోకి సడన్ గా జియో రాకతో ఒక్కసారిగా ఇంటర్నెట్ ధరలు ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. ఇక అంతేకాక గతంతో పోలిస్తే దాదాపుగా ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని ఎక్కువ చేయడం, అదీకాక స్మార్ట్ ఫోన్ ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో మనలో చాలామంది వాటినే వాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, మనలో చాలామంది జేబులో పెన్ లేకుండా అయినా బయటకు వస్తున్నారుగాని, సెల్ లేకుండా మాత్రం బయటకు రావడం లేదు. ఇక ఈ విధంగా ఇంటర్నెట్ వినియోగం మరింతగా విస్తృతం అవడంతో, ఎవరికి నచ్చిన ఫోటోలు, పోస్టులు వారు తమ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆనందం పొందుతున్నారు. ఇక మొన్నటివరకు కేవలం సినిమా థియేటర్ల దగ్గరో, లేక బయటో జరిగే సినిమా హీరోల ఫ్యాన్ వార్స్, 

ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం విపరీతం అవడంతో ఆ మాధ్యమాల్లో ఒకరి హీరోలపై మరొకరు దుమ్మెత్తిపోయడం మరింత పెరిగింది. ఇకపోతే మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజయిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇంట్రో టీజర్, సూపర్బ్ గా అదరగొట్టి యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇంట్రో టీజర్ పై బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేయడం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమాలో ఆర్మీ మేజర్ గా నటిస్తున్న మహేష్ బాబు, కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, ఒక ఆర్మీ ఆఫీసర్ కి ఉండే హెయిర్ స్టైల్, గడ్డం అనేవి లేకుండా ఆ విధంగా మాములుగా కనపడడం ఏమిటంటూ మహేష్ పై బన్నీ ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలెట్టారు. ఇక దానికి మహేష్ ఫ్యాన్స్ స్పందిస్తూ నాపేరు సూర్య సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా చేయించిన కటింగ్ మరియు గడ్డం బాగుందని, అయితే గతంలో అనేక ఆర్మీ బేస్డ్ సినిమాలు వచ్చాయి, అందులో ఎంతమంది హీరోలు పక్కాగా హెయిర్ కట్ మరి గడ్డంతో మీరు చెప్తున్న విధంగా కనపడ్డారో చూపండి అంటూ బన్నీ ఫ్యాన్స్ ట్రోల్స్ పై పోస్టులు చేస్తూ ప్రశ్నిస్తున్నారు. 

ఇక వారిద్దరి అభిమానుల మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా సాగుతోంది. అయితే దీనిపై సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ, నిజానికి ఆర్మీలో పనిచేసేవారికి ఫలానా విధంగా హెయిర్ స్టైల్ మరియు గడ్డం ఉండాలని ఎక్కడా కూడా నియమం లేదని, అయితే ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువమంది హెయిర్ స్టైల్ మరియు గడ్డం బాగా తక్కువగా ఉండేలా చూసుకుంటారని అంటున్నారు. అయితే అవన్నీ ప్రక్కన పెడితే, ఇది కేవలం సినిమా మాత్రమేనని, సినిమాని సినిమాగా చూడాలే తప్ప, ఈ విధంగా ప్రతి చిన్న అంశాన్ని పట్టుకుని వేరొక హీరోలను తప్పుపట్టడం సరైనది కాదని వారు అంటున్నారు. మరి ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వార్ ఇప్పటికైనా ముగుస్తుందో లేదో చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: