అక్కినేని నాగార్జున హీరోగా రిలీజ్ అయిన మన్మధుడు -2 బాక్సాఫీస్ దగ్గర అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అతని రొమాంటిక్ కామెడీ చిత్రం మన్మధుడు కి ఇది సీక్వెల్. ఈ చిత్రం థియేటర్ వద్ద ఎంత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది అంటే సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం అయిన 'కొబ్బరి మట్ట' కూడా కలెక్షన్ల విషయంలో అధిగమించేలా. 
మన్మధుడు 2 సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. శాంతి థియేటర్ లో మొదటి రోజు ఉదయం తప్ప మరే షోలో హౌస్ఫుల్ కాలేదు ఈ చిత్రం. శనివారం రిలీజ్ అయినా కొబ్బరిమట్ట సంధ్య 70ఎంఎం లో బాగానే ఆడింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే దాదాపు హౌస్ ఫుల్ అయింది. అయితే సంపూర్ణేష్ బాబు నాగార్జునను దాటేస్తాడని ఎవరైనా ఊహిస్తారా ?


మన్మధుడు-2 రెండవ రోజు గ్రాస్ 70 లక్షలు కాగా… కొబ్బరి మట్ట శాంతి కన్నా కెపాసిటీ లో ఎక్కువైనా సంధ్య థియేటర్ ద్వారా 1 లక్ష 14 వేల రూపాయల గ్రాస్ ను సంపాదించింది. విపరీతమైన నెగిటివ్ టాక్ మన్మధుడు-2 వసూళ్లపై భారీగా ప్రభావం చూపింది. మొన్ననే నేసిన అవార్డు సాధించిన చిత్రం యొక్క దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కనీసం యావరేజ్ టాక్ కూడా సెక్స్ సంపాదించుకో లేకపోవడం గమనార్హం.


శనివారం మొత్తం నాలుగు షోలు కలిపితే కొబ్బ‌రిమ‌ట్ట 2.88 ల‌క్ష‌ల గ్రాస్ రాబ‌డితే.. మ‌న్మ‌థుడు-2 మాత్రం 1.93 ల‌క్ష‌లే క‌లెక్ట్ చేసింది. సరే మొదటి రోజు కాబట్టి సంపూర్ణేష్ బాబు సినిమా కి ఎక్కువ మొత్తం వచ్చింది అనుకుందాం. కానీ నాగార్జున సినిమా కి మొదటి రోజు వచ్చింది 2.83 లక్షల గ్లాస్ మాత్రమే. ఇదేవిధంగా కనుక నాగార్జున సినిమాలు కొనసాగితే త్వరలోనే అతను దుకాణం సర్దివేయడం ఖాయం. ఎవర్ గ్రీన్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూవీని, స్పూఫ్ కామెడీ చిత్రం అధిగమించడం భలే కామెడీ గా ఉంది కదూ. కానీ నాగ్ మాత్రం దీనిని సీరియస్ గానే తీసుకుంటాడు అనుకుంటున్నాం.


మరింత సమాచారం తెలుసుకోండి: