పాయల్ రాజ్ పుత్.. ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఎవరూ ఊహించని విధంగా తొలి చిత్రం హిట్ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్లు బాగానే క్యూకట్టాయి. వాటిలో ఎన్ని హిట్ అవుతాయి.. మరి ఎన్ని ఫట్ అంటాయి అన్నది మాత్రం తేలాల్సి ఉంది. వాటి సంగతి ఎలా ఉన్నా..ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.


టాప్ హీరోల సరసన కూడా ఆఫర్లు సంపాదించుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అమ్మడే ప్రధాన సేల్ కంటెంట్ గా మరో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పేరు కూడా ఆర్ఎక్స్ 100 తరహాలోనే ఆర్ డీఎక్స్ లవ్.. అంటే మొదటి సినిమా క్రేజ్ ను ఈ సినిమాకు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. హీరోయిన్ అంటే కేవ‌లం గ్లామ‌ర్‌కి మాత్రమే ప‌రిమిత‌మ‌వ్వ‌కుండా మొద‌టి చిత్రంలోనే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో బోల్డ్ క్యారెక్టర్‌లో న‌టించి ఆక‌ట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలోనూ అదరగొట్టిందట.


ఈ ఆర్‌డీఎక్స్ లవ్ సినిమాలోనూ పాయల్ బోల్డ్ గా ఉండే పాత్రలో కనిపించనుందట. తాజాగా ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లోనూ పాయర్ రాజ్ పుత్.. ఎర్ర డ్రస్సులో వెర్రెక్కించేసింది. ఆ ఫోటోలు చూస్తుంటే మళ్ళీ కుర్రకారు గుండెల్లో రెడ్ అలర్ట్ మొదలవడం ఖాయంగా కనిపిస్తుంది. నడుం ఒంపులు బాగా కనిపించేలా.. నాభి అందాలు కళ్లకు కట్టేలా ఉన్న ఈ డ్రెస్ పాయల్ కు బాగా సూట్ అయ్యింది.


దీనికితోడు.. పీలికల్లాంటి వస్త్రాలతో కాలి సొగసులు కూడా బాగా కనిపించేలా టోటల్ రెడ్ బ్యాక్ డ్రాప్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో పాయల్ శృంగార రసాధిదేవతగా కుర్రాళ్లకు కనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.. మరి పాయల్ గ్లామర్ ఈ సినిమాను ఎంతవరకూ కాపాడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: