తెలంగాణ సీఎం ఫ్యామిలీ తెలుగు సినీరంగం వైపు ఆసక్తి చూపుతోంది. స్వయంగా కేసీఆర్ సినీనిర్మాణంలోపాలుపంచుకోవాలను కుంటున్నారు. తెలుగు భాష గుర్తుండిపోయేలా సినిమా తీయాలనుకుంటున్నారా.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చక్కటి సాహితీవేత్త కూడా. ఆయన తెలుగు సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నారు.


క్లాసికల్ సినిమాలంటే బాగా ఇష్టపడే కేసీఆర్.. శంకరాభరణం సినిమాను పాతిక సార్లు చూశారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా కె. విశ్వనాథ్ ను కలసి చెప్పారు. ఉన్నత విలువలతో కూడినఎన్నో గొప్పచిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరోచిత్రం రావాలని కేసీఆర్‌ కోరికగా చెబుతున్నారు.


అంతే కాదు.. విశ్వనాథ్ దర్శకత్వానికి ఒప్పుకుంటే.. సినిమా నిర్మాణపర విషయాలు తాను చూసుకుంటానని కేసీఆర్ మాట ఇచ్చారు. ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన కేసీఆర్‌కు కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. విశ్వనాథ్ దంపతులను పట్టువస్త్రాలతో సన్మానించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులు సైతం కేసీఆర్‌ని సన్మానించారు.


కేసీఆర్‌, విశ్వనాథ్ మధ్య సినిమాలు, భాష, సాహిత్యం తదితర అంశాలపై గంటకుపైగా ఆసక్తికరమైన చర్చ జరిగింది.

కేసీఆర్ ఏమన్నారంటే..

నేను మీ అభిమానిని... చిన్నప్పటి నుంచి మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా.. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓ సారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు ( విశ్వనాథ్‌ ) తీసే ప్రతీ సినిమా ఓకావ్యంలాగా ఉంటుంది. సినిమాలను తపస్సుతో తీస్తారు . మీ సినిమాల్లో వాడే భాష, పాటలు, కళాకారుల ఎంపిక సన్నివేశాల చిత్రీకరణ, సంభాషణలు ప్రతీదీ గొప్పగా ఉంటాయి అని కేసీఆర్ మెచ్చుకున్నారు. ఏదేమైనా విశ్వానాథ్ తో సీఎం భేటీ కారణంగా సినీపరిశమ్రలోనూ ఉహాగానాలు చెలరేగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: