దాదాపు 28 సంవత్సరాల తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు పురస్కారం దక్కింది. అందాల నటి సావిత్రి జీవిత చరిత్రను మహానటి పేరుతో నాగ అశ్విన్ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాలో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ కి చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల నుండి అలాగే దక్షిణాది సినిమా రంగానికి చెందిన చాలా మంది ప్రముఖుల నుండి సినిమా హిట్ అయిన సందర్భంలో ప్రశంసలు దక్కాయి. అయితే ఇటీవల 66వ జాతీయ పురస్కారాల్లో కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించడం తో తాజాగా ఆమె పేరు దేశమంతా మారుమ్రోగుతోంది. ఇటువంటి నేపథ్యంలో తనకు వచ్చిన జాతీయ అవార్డు ను ఉద్దేశించి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.


ఈ సందర్భంగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ...మహానటి మూవీకి మూడు అవార్డులు ఆనందంగా ఉందని.. తనకు ఉత్తమ నటి అవార్డు రావడం మరింత సంతోషంగా ఉందని కీర్తి సురేష్ తెలిపింది. తన తల్లికి నేషనల్ అవార్డు అందించేందుకే సినిమాల్లోకి వచ్చానని..లక్ష్యాన్ని అందుకున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. దీంతో ఈ అవార్డు తన తల్లికి అంకితం చేస్తున్నట్లు పేర్కొంది. మలయాళంలో మా అమ్మ నటించిన తొలి సినిమాకే జాతీయ పురస్కారం రావాల్సింది. ఆ మూవీలో తన పాత్రను ఎంతగానో ప్రేమించేది.


ఆ చిత్రానికి 10-11 నేషనల్ అవార్డులు వచ్చాయి. తనకు కూడా అవార్డు వస్తుందని అమ్మ భావించింది. కానీ చివరి క్షణాల్లో మార్పుల వలన అది జరగలేదు. దాని గురించి నాతో చాలా సార్లు చెప్పింది. అమ్మ కలను నెరవేర్చాలని అనుకున్నా. అందుకోసమే నటనను కెరీర్‌గా ఎంచుకున్నా. అంతేకాకుండా మహానటి ప్రాజెక్టు తన దగ్గరికి వచ్చినప్పుడు పెద్దగా ఏది ఎక్స్పెక్ట్ చేయలేదని కేవలం సావిత్రిల నటించాలని గట్టిగా పట్టుదలగా ఆ పాత్రను చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సావిత్రి హావ భావాలు పలికించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని లేటెస్ట్ సావిత్రి పాత్రను పోషించి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంటున్న ని ఎప్పుడూ ఊహించలేదు సినిమాకు మూడు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని కీర్తి సురేష్ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: