‘సాహో’ ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయిపోతున్నాయి. ఈ సినిమా సాధించే రికార్డుల గురించి అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో ఈ మూవీ పై నెగిటివ్ ప్రచారం కూడ చాల తారస్థాయిలో జరుగుతోంది. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో రవితేజ వీరాభిమానులు ఈ మూవీ కథ పై మొదలుపెట్టిన ఒక ప్రచారం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లో 2 వేల కోట్ల దోపిడీ గురించి తెలుసుకోవడానికి ప్రభాస్ ను అండర్ కవర్ కాప్ గా నియమిస్తారు అన్న విషయం క్లారిటీ వచ్చింది. 

అయితే ఆ దోపిడీని ప్రభాస్ ఎలా పట్టుకున్నాడు అన్న విషయం తెలియకపోయినా ఈ మూవీవి కథకు సంబంధించి వస్తున్న లీకుల ప్రకారం ఈ భారీ దోపిడీని ప్రభాస్ చేసినట్లుగా ఈమూవీ కథలో చూపించబోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ ఈ దోపిడీని ఒక మంచి పనికోసం చేసినట్లుగా ఈ కథలో ట్విస్ట్ ఇచ్చినట్లు టాక్. 

ఇప్పుడు ఈ లీకులను ఆధారంగా చేసుకుని రవితేజ వీరాభిమానులు రంగంలోకి దిగారు. ఈ మూవీ కథ రవితేజ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘కిక్’ సినిమా కథలా ఉంటుందని ప్రచారం మొదలు పెట్టారు. ‘కిక్’ మూవీలో కూడ రవితేజ కొన్ని మంచి పనుల కోసం దోపిడీలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ లోని పాత్ర కూడ రవితేజ పాత్ర షెడ్ లో ఉంటుందా అంటూ సందేహాలు వ్యక్త పరచడమే కాకుండా అదే నిజం అయితే ‘సాహో’ కథలో కొత్తదనం ఏముంది అంటూ మాస్ మహారాజ అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో టాప్ హీరోల అభిమానులు అంతా ‘సాహో’ పై ఎలాంటి నెగిటివ్ ప్రచారానికి సిద్ధంగా ఉన్నారో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: