రామాయణం ఒక ఎపిక్.. ఎన్నిసార్లు చదివినా మరోసారి చదవాలి అనిపిస్తుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా రామాయణ ఇతివృత్తాన్ని  తీసుకొని సినిమాలుగా తీసినా మరొకటి తీయాలనిపిస్తుంది. లోతుగా వెళ్లి పరిశీలించే వారికీ కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి.  కొత్త కొత్త పాత్రల గురించి తెలుస్తుంటాయి.  ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.  చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  


ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్, ప్రైమ్ మూవీస్ అధినేతలు కలిసి రామాయణం సినిమాను తెరకెక్కించబోతున్నారు.  ఇది మూడు భాగాలుగా.. దాదాపు రూ. 1500 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో సినిమాను నిర్మించబోతున్నారు.  3డి లో ఈ సినిమా ఉండబోతున్నది.  దంగల్ దర్శకుడు, మామ్ దర్శకుడు ఇద్దరు కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి.  


2021 లోనే సినిమాను ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.  రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు కాబట్టి, సినిమా ఖచ్చితంగా ఉంటుంది.  ఎందుకంటే గతంలో మహాభారతాన్ని వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీస్తామని చెప్పిన మలయాళం నిర్మాతలు దాన్ని పక్కన పెట్టారు.  ఈ సినిమా కూడా అలానే ఉంటుందేమో అనుకున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో యూనిట్ ఉన్నట్టు సమాచారం. 


రామాయణం అనగానే గుర్తుకు వచ్చేది రాముడు, రావణుడు.  రాముడు ఎవరు చేయబోతున్నారు అనే దానికి అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పడు ఫైనల్ గా వినిపిస్తున్న పేరు హృతిక్ రోషన్.  ప్రస్తుత కాలంలో రాముడి గెటప్ కు హృతిక్ సరిగ్గా సరిపోతాడని వార్తలు వస్తున్నాయి.  దీనిపై అల్లు అరవింద్ యూనిట్ ఇప్పటికే హృతిక్ ను సంప్రదించారని, చర్చలు నడుస్తున్నాయని టాక్.  ఈరోజుల్లో సీత క్యారెక్టర్ అంటే నయనతార గుర్తుకు వస్తుంది. నయనతారకు పోటీగా అనుష్క పేరు కూడా వినిపిస్తోంది.  మరి చూడాలి ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో.  


మరింత సమాచారం తెలుసుకోండి: