ప్రభాస్ సాహో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.  సినిమా ఎలా ఉండబోతుందనే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలకు మించి ఉన్నది.  భారీ యాక్షన్ తో అదిరిపోయింది.  అబుదాబి సమీపంలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో సినిమాను షూట్ చేశారు.  సెట్ అనుకుంటే చిన్నది కాదు.  ఏకంగా ఒక నగరాన్ని సృష్టించారు.  అదేంటి అన్నది సినిమాలో చూడాల్సిందే.  


ఈ సినిమాను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో భారీగా ప్రమోషన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ముంబైలో చేసిన సంగతి తెలిసిందే.  నిన్న హైదరాబాద్ లో యూనిట్ ప్రెస్ మీట్ జరిగింది.  బెంగళూరు, చెన్నై, కోచి, హైదరాబాద్ తో పాటు దుబాయ్ లో భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు.  


ఇందులో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు.  మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సినిమా రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు నిర్వహిస్తారు.  కానీ, సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఆగష్టు 18 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.  


దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నారు.  ఆ వేడుక కోసం యూనిట్ అందరు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  రిలీజ్ కు ఇంకా కేవలం 18 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం.  బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: