మెగాస్టార్ చిరంజీవి సైరా  పూర్తి చేసుకున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కాబోతున్నది. అందుతున్న సమాచారం ప్రకారం సైమా వేడుకల్లో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.  సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తం ఈ అవార్డుల వేడుకల్లో పాల్గొంటుంది.  దోహాలో జరిగే ఈ వేడుకల్లో సైరా ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం.  


ఇక ఆగష్టు 22 వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారు.  ఆరోజున ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  సైరా కోసం భారీగా వెయిట్ పెరిగిన మెగాస్టార్.. తన 152 వ సినిమా కోసం బరువు తగ్గిపోయారు.  స్లిమ్ గా మారిపోయారు.  వయసు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తున్నారు.  


చిరు న్యూ లుక్ ఇప్పటికే సామజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నది.  అసలు మెగాస్టార్ అంత స్లిమ్ గా మారడానికి కారణం ఎవరు అంటే.. చరణ్ భార్య, మెగాస్టార్ కోడలు ఉపాసన అని అంటున్నారు.  ఉపాసన చెప్పిన డైట్ ను మెగాస్టార్ తూచా తప్పకుండా ఫాలో అయ్యారు.  తన ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నారు.  సైరా పూర్తి చేసుకున్న కొద్దిరోజుల్లోనే మెగాస్టార్ ఇలా స్లిమ్ గా మారిపోవడం విశేషం.  స్లిమ్ గా మారిపోయిన మెగాస్టార్ ను చూస్తుంటే.. వావ్ అనిపిస్తున్నారు.  


152 వ సినిమా ఆగస్టు 22 వ తేదీన పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయినా.. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.  సైరా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ రెండు నెలలు ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండబోతున్నాడు మెగాస్టార్.  చారిత్రాత్మక కథతో, పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.  ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేయాలి  కాబట్టి ఈ రెండు నెలలు సినిమా కోసం పూర్తిగా కేటాయించాలని మెగాస్టార్ అనుకున్నారు.  అందుకే ఈ సినిమాపైనే మొదట దృష్టి పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: