నాగ్ మన్మధుడు 2 ఇటీవలే రిలీజ్ అయ్యింది.  మొదట సినిమా పర్వాలేదని టాక్ వచ్చింది.  తరువాత మిక్స్డ్ టాక్.. ఇప్పుడు ఆబ్బె సినిమా పెద్దగా లేదని అంటున్నారు.  ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఇన్ని షేడ్స్ తో టాక్ రావడం ఏంటో అర్ధం కావడం లేదు.  ఈ సినిమా కోసం నాగార్జున చాలా కష్టపడ్డాడు.  యూత్ తో పోటీపడి నటించాడు.  


ఫ్రెంచ్ మూవీకి ఇది రీమేక్.  60 సంవత్సరాల వయసులో కూడా ప్రేమలో పడొచ్చు. ముద్దులు పెట్టుకోవచ్చు. రొమాన్స్ చెయ్యొచ్చు అన్నది సినిమా కాన్సెప్ట్.  ప్రేమకు వయసుతో సంబంధం లేదు.  ప్రేమ ఎప్పుడు ప్యూర్ గా ఉంటుంది.  ఇది కథ.  అయితే, మన ప్రేక్షకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  నాగార్జున రొమాంటిక్ హీరో సందేహం అవసరం లేదు.  


ఇందులో ఆ రొమాన్స్ మరింత ఎక్కువైంది.  60 ఏళ్ల వయసులో నాగార్జున యూత్ లా రెచ్చిపోయి అలా లిప్ కిస్ లు చేస్తూ.. మంచం పై యుద్ధం చేయడమే నచ్చడం లేదు. సినిమాను సినిమాలా అర్ధం చేసుకోవాలిగాని, ఎందుకు సున్నాలు పూస్తున్నారో తెలియడం లేదు.  తన జీవిత లక్ష్యం కోసం నాగార్జున లైఫ్ ను త్యాగం చేస్తాడు.  ఒక పెర్ఫ్యూమర్ కావడం కోసం నిరంతరం కష్టపడుతుంటారు.  


దాంతో ప్రేమ, పెళ్లి రెండు పక్కన పెట్టేస్తాడు.  తన జీవితం మాత్రమే తన చేతిలో ఉందని నమ్ముతాడు.  ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు.  జీవిత లక్ష్యం కోసం జీవితంలో పెళ్లి మిగతా విషయాలను పక్కన పెట్టేస్తున్నారు.  అయితే, నాగార్జున ఇందులో జీవిత లక్ష్యంతో పాటు అమ్మాయిలను ప్రేమిస్తాడు.  పడేస్తాడు.  ఒక్క రాత్రి కోసమే అదంతా చేస్తుంటాడు.  ఇదే సినిమాను యూత్ చేసి ఉంటె ఈ పాటికి థియేటర్ల దగ్గర క్యూలు కట్టేవారు.  నాగార్జున వంటి సీనియర్ నటుడు చేయడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: