నాని లాగే నాని అభిమానులు కూడ వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే ఇప్పుడు నాని అభిమానులు కూడ టాప్ హీరోల అభిమానులతో సమానంగా ఎదుటి వ్యక్తుల పై మాటల దాడి చేయడం ఒక కొత్త అలవాటుగా చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు హరీష్ శంకర్ ను టార్గెట్ చేస్తూ నాని అభిమానులు మొదలు పెట్టిన మాటల దాడి హాట్ టాపిక్ గా మారింది. 

హరీష్ శంకర్ వరుణ్ తేజ్ తో తీసిన ‘వాల్మీకి’ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13 న ఖరార్ కావడంతో అదేరోజు విడుదల కాబోతున్న నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆమూవీ కూడ ఘన విజయం సాధించాలి అంటూ ట్విట్ చేసాడు. దీనికి సమాధానంగా నాని రీ ట్విట్ చేస్తూ ‘వాల్మీకి’ మూవీ కూడ తన ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో సమానంగా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ హరీష్ శంకర్ వరుణ్ తేజ్ లకు శుభాకాంక్షలు తెలియచేసాడు. 

అయితే ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకుండా నాని అభిమానులు హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తూ వరుణ్ తేజ్ నానీతో పోటీపడి గెలవగాలడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఈ  విషయాలుఅన్నీ మెగా అభిమానుల దృష్టికి రావడంతో మెగా అభిమానులలో చాలామంది నానీని కార్నర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

 ‘గ్యాగ్ లీడర్’ టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన నాని మెగా స్టార్ తో సరిసమానం అవుతాడా అంటూ నాని అభిమానుల కామెంట్స్ కు మెగా అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే నానీ పట్ల అసహనంతో ఉన్న మెగా అభిమానులు నాని వీరాభిమానులు చూపిస్తున్న అత్యుత్సాహానికి రగిలి పోతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ రెండు సినిమాలు చాల గ్యాప్ లో విడుదల అవుతాయి అని అనకుంటే ప్రభాస్ ‘సాహో’ రగిల్చిన చిచ్చుతో ఇలా నాని వరుణ్ తేజ్ ల వార్ జరగబోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: