మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో రాజకీయాలపై దృష్టి మళ్లడంతో ఆయన సొంతంగా ఓ పార్టీ పెట్టారు.  ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించిన ఆయన కొంత కాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.  అదే సమయంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరుగుతుంది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి సీనీ నేపథ్యం ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని భావించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం చిరంజీవిని కేంద్రమంత్రిగా నియమించింది. 

అప్పటి వరకు సినీ నేపథ్యంలో ఉన్న చిరంజీవి రాజకీయ నేతగా ఎదిగారు..కానీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది.  ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తెరపై కనిపించేందుకు ఉత్సాహం చూపించారు.  వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.  ఈ మూవీ రైతు సమస్యలపై ఉండటంతో అందులోనూ ద్విపాత్రాభినయం, మాస్ మసాల అన్నీ ‘ఖైదీ నెంబర్ 150’కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. 

ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత..చిరంజీవి తన 151 వ సినిమా పై ఫోకస్ చేశారు.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా అలనాటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ కూడా పూర్తి అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో పాటు పలువురు ఇతర భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే రోజు ‘సైరా’ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.  ఈ నెల 20వ తేదీన ముంబైలో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమానికి అమితాబ్, చిరంజీవి ,విజయ్ సేతుపతితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: