ఎన్నో సంవత్సరాల క్రితమే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఖడ్గం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ పృథ్వీ. ఖడ్గం సినిమా హిట్ కావటంతో పృథ్వీకి వరుసగా అవకాశాలొచ్చాయి. టాలీవుడ్లో ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో పృథ్వీ నటిస్తూ, నవ్విస్తూ ఉన్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పృథ్వీ వైసీపీ పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేసాడు. వైసీపీ పార్టీ విజయానికి తన వంతుగా చాలా కష్టపడ్డాడు పృథ్వీ. 
 
ఆ కష్టానికి ప్రతిఫలంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీకి ఎస్వీబీసి ఛానెల్ చైర్మన్ గా పదవి ఇచ్చారు. కానీ పృథ్వీ వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వటంతో పృథ్వీకి అవకాశాలిచ్చిన డైరెక్టర్లు కమిటైన సినిమాల నుండి తీసేసారని ప్రచారం జరుగుతోంది. కొన్ని పెద్ద సినిమాల్లో తీసేయటంతో పృథ్వీ అడ్వాన్సులు కూడా వెనక్కు ఇచ్చేసాడని ప్రచారం జరుగుతోంది. పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారం నిజమేనని చెప్పాడు. 
 
సినిమా ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం లభించటం ఆనందంగా ఉందని పృథ్వీ చెప్పాడు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కామెంట్ చేసారు. పృథ్వీ గారు, మిమ్మల్ని వైసీపీ పార్టీ కోసం పని చేసే వ్యక్తిగా నేను అభిమానిస్తాను. ఒకసారి మీరిప్పుడు మీడియా ముందు చెప్పిన పాయింట్స్ నేనప్పుడు మీడియా ముందు చెప్పిన పాయింట్స్ చెక్ చేయండి. 
 
చివరికి మీరు కూడా హేమలాగే రియలైజ్ అయ్యారు. ఒకసారి నా గురించి ఒక వెబ్ ఛానెల్ లో ఎంత నీచంగా మాట్లాడారో ఆ పాయింట్లే మీరు మరలా మీడియా ముందు రిపీట్ చేస్తున్నారు. కర్మ అనేది రబ్బర్ బ్యాండ్ లాంటిది. అది తిరిగి మీ దగ్గరికే వస్తుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు శ్రీరెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: