ఊహించని సక్సస్ ను అందుకున్న ‘కొబ్బరిమట్ట’ మూవీకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లను పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న ఆదివారం ఈ మూవీ ప్రదర్శింపబడుతున్న అన్ని ధియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాయి. 

ఈ రోజు సోమవారం అయినప్పటికీ సెలవురోజు కావడంతో ఈ మూవీ కలక్షన్స్ ఈరోజు కూడ బాగా ఉండబోతున్నాయి. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ అనూహ్య విజయం సాధించడంతో ఈ మూవీని అతి తక్కువ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు 300 శాతం లాభాలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ఈ మూవీ సక్సస్ తో జోష్ లోకి వెళ్ళిపోయిన సంపూర్ణేష్ భాగ్యనగరంలో ఈ మూవీ ప్రదర్శింప బడుతున్న ధియేటర్లకు వెళ్లి అక్కడ ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాడు. ఈ సందర్భంలో సంపూ మాట్లాడుతూ ఈ మూవీ సక్సస్ కు మెగా ఫ్యామిలీ ముఖ్యంగా నాగబాబు కారకుడు అంటూ ఓపెన్ గా చెపుతూ మెగా అభిమానులను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ మూవీ విడుదల రోజున ‘కొబ్బరిమట్ట’ సక్సస్ కావాలి అంటూ నాగబాబు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన చిన్న విడియో వల్ల తన మూవీకి ఇంత భారీ సక్సస్ వచ్చింది అంటూ సంపూర్ణేష్ పొంగిపోతున్నాడు. ఈ విషయాలు అన్నీ నాగబాబు దృష్టి వరకు వెళ్ళడంతో సంపూకు షాక్ ఇచ్చే ట్విట్ చేసాడు నాగబాబు. ఈ మూవీ దర్శకుడు స్టీవెన్ శంకర్ హీరో సంపూర్ణేష్ మెగా వీరాభిమానులు అని చెపుతూ తమ మెగా ఆభిమానులను ప్ర్రోత్సహించు కోవలసిన కనీస బాధ్యత తమ మెగా ఫ్యామిలీ పై ఉంది అంటూ నాగబాబు చేసిన ట్విట్ సంపూర్ణేష్ కు మరింత జోష్ ను ఇస్తోంది. ఈ మూవీ హడావిడి ఆగష్టు 15 సినిమాలు విడుదల అయ్యేదాకా కొనసాగే ఆస్కారం ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: