టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్, ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా కొన్ని బి, సి సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్లు ట్రేడ్ విశ్లేషకుజులు చెప్తున్నారు. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, పూరి డైలాగ్స్, అదరగొట్టే యాక్షన్ మరియు ఫైట్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా, సూపర్ హిట్ కొట్టిన సందర్భంగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన పూరి, నిజానికి తాను ఫ్లాప్స్ లో ఉన్నపుడు తనకు ఏ హీరో నుండి సినిమా తీయమని పిలుపు రాలేదని వాపోవడం జరిగింది. ఇక అంతేకాక కొన్నేళ్ల క్రితం తాను రాసుకున్న పవర్ఫుల్ స్క్రిప్ట్ జనగణమన సినిమాను మహేష్ గారితో తీద్దాం అని ప్రయతిస్తున్నప్పటికీ, 

ఆయన నుండి ఎటువంటి సమాధానం రావడం లేదని అన్నారు. అయితే నిజానికి తనకు మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ అంటే ఎంతో అభిమానమని, ఎందుకంటే తన కెరీర్ లోనే పవర్ ఫుల్ గా చెప్పుకునే ఈ జనగణమన సినిమాని మహేష్ తోనే చేయాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. కాకపోతే మహేష్ మాత్రం, తాను హిట్స్ లో ఉన్నపుడు మాత్రమే పిలుస్తారు, ఫ్లాప్స్ లో ఉన్నపుడు పట్టించుకోరు అంటూ సూపర్ స్టార్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య పూరి చేసిన వ్యాఖ్యలు కొద్దిపాటి వివాదానికి కారణం కూడా అయ్యాయి. అనంతరం కొద్దిరోజులకు ఆ వివాదం ముగియడంతో, పూరి తన తదుపరి సినిమా ప్లాన్స్ లో నిమగ్నమయి ఉన్నట్లు సమాచారం. అయితే పూరి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను తీస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ అందరికి ఒక్కసారిగా షాక్ ఇస్తూ, ఆయన కాసేపటి క్రితం తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. 

అయితే ఆ సినిమా మరెవరితోనో కాదు, సూపర్ స్టార్ మహేష్ కు వీరాభిమాని అయిన యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో. కాసేపటి క్రితం ఆయన బ్యానరైన పూరి కనెక్ట్స్ నుండి ఈ సినిమా విషయమై ఒక అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. దీనితో ఒక్కసారిగా అందరిలోనూ ఒకటే చర్చ మొదలయింది, అసలు పూరి విజయ్ నే తన సినిమాలో హీరో గా ఎంచుకోవడానికి కారణం ఏంటి, ఒకవేళ సూపర్ స్టార్ తో తీద్దాం అనుకున్న జనగణమన సినిమాను ఆయన ఫ్యాన్ అయిన విజయ్ తో తీసి, మహేష్ కు షాక్ ఇవ్వాలని చూస్తున్నారా అంటూ, పలు ప్రశ్నలు సంధిస్తూ, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే పూరి, విజయ్ ల కాంబోలో ఎటువంటి సినిమా రానుంది అనే విషయమై మాత్రం వారి నుండి సమాధానం రావాలసిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు.....!!     


మరింత సమాచారం తెలుసుకోండి: