అల్లు అర్జున్ -  త్రివిక్రమ్  కలయికలో వస్తోన్న  'అల్లు అర్జున్' 19వ చిత్రానికి టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారు. ఈ టైటిల్ ను ఆగష్టు 15న రివీల్ చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా  పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  ను  జరుపుకుంటుంది ఈ చిత్రం.  అయితే  ఈ సినిమా కథలో మంచి ఎమోషన్ ఉంటుందట. సహజంగానే తన సినిమాల్లో ఎమోషన్ని కాస్త ఎక్కువుగానే ఉండేలా చూసుకుంటాడు త్రివిక్రమ్. అయితే ఈ సారి  ఎమోషన్నే హైలెట్ చేస్తూ.. బన్నీ కోసం మంచి సిస్టర్ సెంటిమెంట్ కథ రాశాడట.  రెగ్యులర్ సినిమాల్లో లాగా  రెండు ఎమోషనల్  సీన్స్,  నాలుగు డెప్త్ డైలాగ్ లతో చెల్లి సెంటిమెంట్ ను పండించడం కాకుండా..  ఇన్సిడెంట్స్ రూపంలో మొత్తం కథే చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా కథ రాశాడట. 

అలాగే త్రివిక్రమ్  సినిమాలో కామెడీని కూడా  హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట.  ముఖ్యంగా వెన్నల కిషోర్ కోసం  అద్భుతమైన పాత్రను రాశాడట.   సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి - కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని..  అలాగే  సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే  సీక్వెన్స్ లో కూడా  కిషోర్  పగలబడి నవ్వేలా కామెడీ చేస్తాడట.   ఇక ఈ సినిమలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  పూజా హెగ్డే ఇప్పటికే  డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.

దీనికితోడు సినిమాలో అల్లు  అర్జున్ ను  త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా  చూపించబోతున్నాడని సమాచారం.  బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి  హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త బన్నీ కనిపించేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం సంక్రాంతి 2020 లో విడుదల అవుతుంది.  మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ బన్నీకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుకపడిన బన్నీ ఈ సినిమా పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: