అక్కినేని నాగార్జున-రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో వచ్చిన మన్మథుడు 2 ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. సుమారు 17 ఏళ్ల కిత్రం వచ్చిన సూపర్ డూపర్ హిట్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మన్మథుడు 2 ప్రస్తుతం డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. నాగార్జున గత సినిమాల కంటే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మన్మథుడు 2.. 24 కోట్ల బిజినెస్ చేసింది. కానీ రెండు రోజులకు 7 కోట్లతో సరిపెట్టుకుని ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఘోరమైన డిజాస్టర్ దిశగా దూసుకుపోతుంది. మరియు భారీ అంచనాలతో అమెరికాలో విడుదల అయిన మన్మథుడు 2 ఇదే స్థాయి టాక్‌తో కంటిన్యూ అవుతోంది. నిజానికి టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్‌తో ‘మన్మథుడు 2’ చిత్రానికి పాజిటివ్ బజ్ ఏర్పడగా.. చిత్రం విడుదల అయ్యాక మాత్రం క్రేజ్ తగ్గిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీలు కొడుతూ నాగార్జునకు షాక్ ఇచ్చింది. ఈ చిత్రం తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. డిజాస్టర్‌ను పయణంగా చేసుకొని దూసుకుపోతున్న మన్మథుడు 2 వరల్డ్ వైడ్ టు డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ సారి లుక్కేయండి..
మన్మథుడు 2 వరల్డ్ వైడ్ టు డేస్ కలెక్షన్స్:
ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 2.10
సీడెడ్ 0.81
నెల్లూరు 0.25
కృష్ణ 0.52
గుంటూరు 0.80
వైజాగ్ 0.84
ఈస్ట్ గోదావరి 0.41
వెస్ట్ గోదావరి 0.43
టోటల్ ఏపీ & టీస్ షేర్ 6.16
కర్ణాటక 0.80
ఇతర ప్రాంతాలు 0.35
ఓవర్సీస్ 0.60
----------------------------------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 7.91
----------------------------------------------------------------