ఎప్పటినుండో అనుకుంటున్న  ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ అయింది.  సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమాకి రంగం సిద్ధం అయింది. సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమా  పూర్తి వివరాలను మరియు ఈ సినిమా సాంకేతిక విభాగాన్ని  అధికారికంగా ప్రకటించారు.  తమిళ మ్యూజిక్ డైరెక్టర్  డి ఇమ్మాన్ ఈ  సినిమాకి మ్యూజిక్ ను సమకూర్చనున్నారు.  అలాగే  ఈ సినిమా కోసం కెమెరామెన్ గా  ప్రముఖ కెమెరామెన్  వెట్రీ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాను  జనవరిలో పొంగల్ సందర్భంగా  రిలీజ్  చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  ఏమైనా  సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో  కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో  ప్రేక్షకులకు  డిఫరెంట్ చిత్రాలను అందిస్తూ.. ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే స్టార్ హీరోల్లో..   సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు.. 'గజినీ', 'సెవెన్త్ సెన్స్' వంటి ఓ కొత్తరకం సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు  ఉన్నాయి.


 ఇక  గోపీచంద్ తో 'శౌర్యం' సినిమాతో  డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత  తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి  బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు.  కాగా ఇప్పుడు సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.  నిజానికి ఆ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.  శివ, సూర్యకు బదులు రజినీకాంత్ తో మూవీ ప్లాన్ చేస్తోన్నాడని.. ఇలా చాల రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు శివ -  సూర్య  కాంబినేషన్ లోనే సినిమా రానుంది.  ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య  క్యారెక్టర్ చాలా బాగుంటుందట.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సూర్య  మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. సినిమా ప్రోమోస్ కు వస్తోన్న స్పందన చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: