తమిళ  స్టార్ హీరో తల  అజిత్  నటించిన  తాజా చిత్రం 'నెర్కొండ పరవాయ్' ఇటీవల విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫిస్ వద్ద సత్తా చాటుతుంది.  4 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 65కోట్ల గ్రాస్ వసూళ్లను  రాబట్టి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. అలాగే నాలుగు రోజుల్లో ఈచిత్రం చెన్నైలో 5.55 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కాగా ఫుల్ రన్ లో ఈ చిత్రం 100కోట్ల క్లబ్ లోచేరడం ఖాయం గా కనిపిస్తుంది. వరుసగా సెలవులు రావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ఈ ఏడాది ప్రారంభం లో విశ్వాసం తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న అజిత్ ఇప్పుడు ఈ తాజా చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు.   

2016లో  బాలీవుడ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన సూపర్ హిట్ హిందీ మూవీ  'పింక్' కు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం . ఒరిజినల్ వెర్షన్ లో   బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించారు.  'ఖాకి'  ఫేమ్ వినోత్ డైరెక్ట్ చేసిన ఈ 'నెర్కొండ పరవాయ్' లో శ్రద్ద శ్రీనాథ్ , అభిరామి , ఆండ్రియా కీలక పాత్రల్లో నటించారు.  సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ  బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్  నిర్మించారు. ఇక అజిత్ తన 60వ చిత్రాన్ని కూడా హెచ్ వినోత్ డైరెక్షన్ లోనే చేయనున్నాడు. అలాగే ఈ సినిమాను కూడా  బోనీ కపూరే నిర్మించనున్నాడు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.  వచ్చే ఏడాది పొంగల్ కు ఈసినిమా విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: