మూడు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేయగా సీజన్ 2 నాని హోస్ట్ చేసాడు. సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయితే సీజన్ 2 మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. కానీ సీజన్ 3లో అందరికీ పరిచయం ఉన్న సెలబ్రిటీలు ఎక్కువగా ఉండటం, నాగార్జున హోస్టింగ్ బిగ్ బాస్ సీజన్ 3ను హిట్ చేస్తున్నాయి. ఈ షోలో మొదటివారం నటి హేమ ఎలిమినేట్ కాగా, రెండవ వారం జాఫర్, మూడవ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు. 
 
జాఫర్ ఎలిమినేట్ అయిన సమయంలో బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అనుకున్నానని, కానీ బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని వ్యాఖ్యలు చేసారు. నిన్న తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయిన సమయంలో తమన్నా కూడా బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో ఈ షో స్క్రిప్టెడ్ ఏమో అనే అనుమానాలు ఉన్నాయి. హోస్ట్ నాగార్జున అడగకపోయినప్పటికి వీరు స్క్రిప్టెడ్ కాదు అని చెప్పటం వెనక ఎవరైనా కావాలని అలా చెప్పిస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. 
 
బిగ్ బాస్ షోలో 24 గంటలు షూట్ చేసి గంట సమయం మాత్రమే చూపిస్తారు. ఈ గంట సమయంలో చూసిన విషయాలే ప్రేక్షకులకు తెలుస్తాయి తప్ప మిగతా విషయాలు ప్రేక్షకులకు తెలియవు. నిన్న ఈ షోకు కమెడియన్ వెన్నెల కిషోర్ గెస్ట్ గా వచ్చాడు. వెన్నెల కిషోర్ రాహుల్ ను పులిహోర కలపవద్దని , శివజ్యోతిని పాతాళ గంగ ఆపమని, అషు రెడ్డిని టాస్కుల్లో పాల్గొనమని సూచనలిచ్చాడు. 
 
కానీ శ్రీముఖి, పునర్నవి, హిమజ విషయంలో మాత్రమే ఇలాగే గేమ్ ఆడమని సలహాలిచ్చాడు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ అలా మాట్లాడటానికి కారణాలేంటి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ ఇంటి సభ్యులను సేఫ్ చేసే సమయంలో కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన బాబా భాస్కర్ ను కొంచెం ఆలస్యంగా సేఫ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో ఈ విధంగా నిర్వాహకులు కావాలనే చేస్తున్నారో లేక యాధృచ్చికంగా జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కావట్లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: