బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు సీను. సమంత హీరోయిన్ గా నటించడమే కాదు బాగా ఎక్స్‌ఫోజింగ్ చేసి గ్లామర్ గాను కనిపించింది. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. అంతా పెద్ద నటులు నటించారు. అయినా సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో కూడా అంతా స్టార్ హీరోయిన్సే. అంతేకాదు డైరెక్టర్స్ కూడా పెద్ద వాళ్ళే. అయినా బెల్లంకొండ శ్రీనివాస్ కి హిట్ పడలేదు. ఒక్క జయ జానకి నాయక మాత్రం అలా నడిచింది. ఇక కెరీర్ లో లాస్ట్ సినిమా అనుకొని చేసిన తమిళ రీమేక్ రాక్షసుడు మాత్రం శీనివాస్ కి మంచి హిట్టిచ్చింది. ఇది నిజంగా ఎవరు ఊహించనిది. ఫస్ట్ వీక్ హిట్ టాక్ తో కలెక్షన్లు బావున్నాయి. అయితే సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయిన రోజుకు కాస్త వీక్ అయింది. దాంతో బ్రేక్ ఈవెన్ ఏదైనా సమస్య అవుతుందేమో అనుకున్నారు. కానీ నాగ్ నటించిన మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ కావడంతో సీన్ మొత్తం మారిపోయింది.

సెకెండ్ వీకెండ్ రాక్షసుడుకి ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఒక్క వైజాగ్ లో కోటి రూపాయలు కట్టి, యాభై లక్షలు అడిషనల్ గ్యారంటీ అన్నారు. అలాంటిది ఇప్పటికే కోటిన్నర షేర్ దాటేసింది. రెండు కోట్లు కనీసం వస్తుందని బయ్యర్ ధీమాగా వున్నారట. ఇక సెకెండ్ వీకెండ్ లో నలభై లక్షలు వసూలు చేయడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ కి తన కెరీర్ లో ఇలా వసూళ్ళు సాధించిన సినిమా ఇదే మొదటిది అని చెప్పాలి. చాలామందికి ఈ సినిమా మీద నమ్మకం ఉన్నప్పటికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరో అనగానే లైట్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికి ఈ సినిమాతో షాకిచ్చాడు.

రాక్షసుడు దాదాపు అన్నిచోట్లా షేర్ వసూలు చేస్తోంది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ఏరియాల్లో వుండటం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే రాక్షసుడు రేంజ్ లో కాకపోయినా, గుణ 369 కూడా ఇంకా చాలాచోట్ల ఎంతోకొంత షేర్ లాగుతోంది. ఇదిలావుంటే రాక్షసుడు విజయం ఇచ్చిన ఉత్సాహంతో నిర్మాత కొనేరు సత్యనారాయణ అర్జెంట్ గా తమిళనాడు సినిమాల మీద కన్నేసారని సమాచారం. సరైన సినిమా దొరికితే అర్జెంట్ గా కొని ఆ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో బిజీగా వున్నారట. మొత్తానికి రాక్షసుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్టివ్వడమే కాదు తన కెరీర్ కు బోలెడన్ని ఆశలు రేపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: