యంగ్ టైగర్ కోసం ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ సాహసానికి పాల్పడ్డాడు అంటున్నాయి టాలీవడ్ వర్గాలు. ఎన్టీఆర్ కు ఓ హిట్టిచ్చి ఆయనను రికవరీ చేయడం కోసం సుకుమార్ తనకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నాడు అన్న టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక సుకుమార్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను, 100% లవ్ తో నాగచైతన్య, తమన్నాలకు అదిరిపోయే హిట్లు ఇచ్చిన ఘనత ఆయనదే. ఇప్పుడు మహేష్ బాబు కు అదిరిపోయే హిట్టిచ్చే పనిలో తెగ బిజీగా ఉన్నాడు ఆయన. మహేష్ తో సుకుమార్ ‘వన్- నేనొక్కడినే’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ను అత్యంత స్టైలిష్ గా చూపిస్తున్నాడట. అయితే ఆర్య-2 సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు బాలివుడ్ ప్రముఖులు కొందరు ఆయనకు వస్తే నో అన్నాడట. కారణం ఎన్టీఆర్ కు హిట్టు ఇచ్చేందుకు స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడట, ‘వన్ ’ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకే ఈ అవకాశం జారవిడుచుకున్నారట సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: