ఆర్ కె రోజా నటిగా, పొలిటీషియన్ గా డ్యుయల్ రోల్ ప్లే చస్తోంది. మధ్యలో  రియాలిటీ షోలలో జడ్జిగా కూడా అమె మెరుస్తోంది. రోజా విషయానికి వస్తే ఎన్ని అయినా చేయగలదు, కానీ ఇపుడు వైసీపీ కొత్తగా అధికారంలోకి వచ్చింది. ఏపీలో అంతా కొత్త సర్కార్ సర్దుకోవాల్సివుంది. అందువల్ల జగన్ పార్టీ నాయకులకు పలు కీలకమైన బాధ్యతలను అప్పగించారు.


వైసీపీలోని సీనియర్ నేతల్లో రోజా ఒకరు. ఆమె రెండవసారి వరసగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను ఏపీ పారిశ్రామికాభివ్రుధ్ధి సంస్థ చైర్మన్ గా జగన్ నియమించారు. విభజన ఏపీలో పరిశ్రమలు లేవు. దాంతో గట్టిగా శ్రమ పడాల్సిఉంటుంది. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు రోజా రోల్ చాలా ఎక్కువగా  ఉంది.


మరి రోజా ఇటువంటి క్రూషియల్ పీరియడ్లో జబర్దస్త్ కి టైం కేటాయించలేరన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో గతంలో ఎలాగున్నా ఫరవాలేదు, ఇపుడు రోజా జబర్దస్త్ లో ఉంటే టీడీపీతో సహా విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెబుతారన్న టాక్ జోరుగా నడుస్తోంది.


అదే సమయంలో రోజాకి ఓ సినిమా ఆఫర్ కూడా ఉంది. దాని కోసం కాల్షీట్లు కేటాయించడం  కోసం జబర్దస్త్ కి టైం ఇవ్వలేకపోవచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా రోజా జబర్దస్త్ లో కనిపించడాన్ని వైసీపీ శ్రేణులు కూడా  హర్షించలేకపోతున్నాయట. ఎందుకు అనవసరంగా విపక్షాలకు మాట విసిరే అవకాశం ఇవ్వడం అన్న భావన వారిలో ఉంది. మొత్తం మీద చూసుకుంటే రోజా కొద్ది రోజుల్లో జబర్దస్త్ నుంచి తప్పుకుంటారని అంటున్నారు.  అదే జరిగితే జబర్దస్త్ కి ఇబ్బంది తప్పదేమో. ఎందుకంటే రోజా వల్ల జబర్దస్త్ షోకి మంచి ఎలివేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: