కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సూర్య కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉంది. తమిళ్ లో చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల చేస్తూ సూర్య చాలా విషయాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాధించాడు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన శివ తో సినిమా చేయడానికి సూర్య రెడీ అయినట్లు సమాచారం. డైరెక్టర్ శివ కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ తో వరుసగా సినిమాలు చేస్తూ మూడు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో తమిళ ఇండస్ట్రీలో అజిత్ తోనే ఎక్కువగా శివ సినిమా చేయడంతో అనేక కామెంట్లు రావటంతో తాజాగా శివ సూర్య తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.


ఈ సినిమాకి సంబంధించిన వార్త ఇటీవల అధికారికంగా కోలీవుడ్లో కూడా వెల్లడయ్యింది. వివరాల ప్రకారం విశ్వాసం చిత్రానికి సంగీతం అందించిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందించబోతున్నాడు. వెట్రి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. మిలాన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. శివ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రకటన చేసింది.


శివ ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో రూపొందించబోతున్నాడు.. హీరోయిన్ ఎవరు తదితర అంశాలన్నీ త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం సూర్య కప్పాన్ అనే సినిమా చేస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ సినిమా గా రూపొందుతోంది. ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయటానికి వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: