తెలుగు సినీ సీమలో మొదటి నుంచి కామెడీకి పెద్ద పీట వేస్తున్న సంగతి విధితమే. రేలంగి కాలం నుంచి చూసుకుంటే రమణారెడ్డి, రాజబాబు, చలం, అల్లు రామలింగయ్య, నగేష్, సుత్తివేలు, వీరభద్రరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది తమదైన నటనతో అలరించారు. రీసెంట్ గా చూసుకుంటే సునీల్ వంటి వారు హాస్యం ఓ రేంజిలో సాగింది.


ఇక వెన్నెల కిషోర్ రోజులు ఇపుడు నడుస్తున్నాయి. ఆయన హీరో పక్కన ఉంటే చాలు. సినిమాకు సగం బలం వచ్చేస్తుంది. దూకుడు సినిమాలో మహేష్ బాబు పక్కన కిషోర్ సపోర్ట్ గా నిలబడి చేసిన కామెడీ ఇప్పటికీ మరచిపోలేరు. ఇక ఈ ఏడాది ఎఫ్ టు లో కూడా కిషోర్ క్లైమాక్స్ సీన్లలో హాస్యం ఒలికిస్తారు.


ఇవన్నీ ఇలా ఉంటే మన్మధుడు 2 మూవీలో హీరో ఎవరు అంటే జవాబు వెంటనే చెప్పేస్తారు నాగార్జున అని. కానీ మూవీలో నాగ్ తో పాటు మొత్తం కనిపిస్తూ హాస్యరసాన్ని ఒలికించిన  కిషోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యారని అంటున్నారు. ఈ మూవీలో కిషోర్ కోసం వెళ్లిన వారు కూడా ఉన్నారంటే ఆయన టైమింగ్, పంచులు ఎంతగా అలరించాయో అర్ధం చేసుకోవాలి.


ఇక సినిమాల్లో బ్రహ్మానందం కనిపించి చాలా రోజులవుతోంది. దాంతో ఆయన స్థానంలో కిషోర్ కుదురుకున్నాడా అనిపించేలా కామెడీ పండిస్తున్నాడు. బ్రహ్మానందం లెజెండరీ యాక్టర్. ఆయన ఆయనే కానీ కిషోర్ మాత్రం ఉన్నంతలో తెలుగు జనాన్ని నవ్విస్తూ బ్రహ్మానందాన్ని పంచుతున్నాడంటున్నారు. ఇటు యంగ్ హీరోలు, అటు సీనియర్ల మధ్య‌న బాగా సెట్ అయిపోతున్న కిషోర్ మరిన్ని మూవీలో తెగ బిజీగా  ఉన్నాడు. పరిస్థితి చూస్తూంటే వెన్నెల కిషోర్ బ్రహ్మానందం ప్లేస్ ని రిప్లేస్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: