సినిమా ఇండస్ట్రీలో ఒకోసారి సినిమాలు చేతులు మారిపోతూంటాయి. ఒకరి కోసం అనుకున్న కథ డేట్స్ ఎడ్జస్ట్ చేయలేక మరొకరు చేయడం, కథ ఒకరికి నచ్చకపోతే మరో హీరోకి నచ్చి చేయడం జరుగుతూంటాయి. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే. శర్వానంద్ రణరంగం సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను మొదట రవితేజకు చెప్తే కథ నచ్చి చేద్దామన్నాడు. కానీ డేట్స్ కుదరక ఈ కథను శర్వాకు వినిపిస్తే చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ విషయాన్ని శర్వానందే స్వయంగా చెప్పాడు. 

 

 

 

ఈ విషయాన్ని సినిమా ప్రారంభానికి ముందే సుధీర్ చెప్పడంతో రవితేజకు ఓ మాట చెప్పి అనుమతి తీసుకోవమని శర్వా చెప్పాడట. అలా రవితేజ్ ఒప్పుకోవడంతో ఈ సినిమా శర్వా చేతికి వచ్చింది. తాజాగా ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ అండదండలు కూడా లభించాయి. సౌండ్ కట్ ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా శర్వా విడుదల చేయించాడు. వీరిద్దరూ స్నేహితులన్న విషయం తెలిసిందే. సినిమాలు చేతులు మారి హిట్ అయితే మొదటిగా కథ విన్న హీరో కొద్దిగా బాధపడడం.. ఫ్లాప్ అయితే గట్టెక్కాం అనుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం సినిమా వారి రాత, గీత మారుతూంటాయి కాబట్టి. అర్జున్ రెడ్డి సినిమా కూడా మొదట శర్వానంద్ కే చెప్పాడు సందీప్ వంగా. కానీ ఆ సినిమాను విజయ్ దేవరకొండ చేసి స్టార్ అయిపోయాడు.

 

 

 

 ఈ సినిమాపై శర్వానంద్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రస్థానం సినిమాలా ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. ప్రియదర్శనీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆగష్టు 15 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: