విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ కు మిక్సిడ్ టాక్ రావడంతో సినిమా లాస్ లోకి వెళ్లిపోయింది. రిలీజ్ కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో రిజల్ట్ తేడా వచ్చింది. ముందే లెంగ్త్ తగ్గించి రిలీజ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మేకర్స్ వెంటనే మేల్కొని 10 నిమిషాలకు పైగా సినిమా కట్ చేసారు. అయినా మౌత్ టాక్ వెళ్లిపోయింది కాబట్టి ఏం చేయలేక పోయారు. పైగా కొత్త సినిమాల రాక, మిక్సిడ్ టాక్ ఈ సినిమా ఆక్యూపెన్సీపై తీవ్ర ప్రభావం చూపింది. 

 

 

 

డియర్ కామ్రేడ్ కి కలెక్షన్లు బాగానే ఉన్నా అవి సినిమాను లాస్ నుంచి గట్టెక్కించేవి కాదు. ప్రస్తుతం ఈ సినిమాకు ఒక్క తెలుగు వెర్షన్ లోనే దాదాపు 7 కోట్లకు పైగా నష్టం వచ్చేట్టుందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. కంటెంట్ పై దర్శక, నిర్మాతలకు, హీరోకు ఎంతో నమ్మకం ఉండటంతో సౌత్ లోని నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు చేసారు. ప్రమోషన్లు కూడ అలానే చేశారు. దర్శకుడి పనితీరు, సంగీతం, ఫోటోగ్రఫీ, కంటెంట్.. ఎక్కడా సినిమాలో లోటు చేయలేదు. ఖర్చు కూడా అలానే పెట్టి సినిమా ఎంతో రిచ్ గా వచ్చేట్టు తీశారు. విజయ్, రష్మికల కెమిస్ట్రీ కూడా యూత్ కి కనెక్టయింది కానీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ తో సినిమాకు దెబ్బకొట్టింది.

 

 

 

ఈ సినిమా ఎఫెక్ట్ తో విజయ్ తో మరో సినిమా చేయాలనుకున్న మైత్రీ మూవీస్ వెనక్కు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదివరకే వీరిద్దరి మధ్యా డీల్ కుదిరినా ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో మైత్రీ వారే రివీల్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: