‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తనలోని బలహీనతలను బయటపెట్టాడు. తనకు మొహమాటం అదేవిధంగా బద్ధకం చాల ఎక్కువ అనీ ఈ రెండు విషయాలు ఫిలిం ఇండస్ట్రీకి పనికిరావు అని తెలిసి కూడ తనని తాను మార్చుకోలేకపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

వాస్తవానికి తాను జనంలోకి వచ్చి తన అభిమానులను కలవడానికి కూడ తాను ఇబ్బంది పడతాను అన్న విషయాన్ని కూడ తెలియచేసాడు. ఎంత ప్రయత్నించినా ఈ లోపాల నుండి తాను బయటపడలేకపోతున్న విషయాన్ని వివరిస్తూ తన సినిమాల విడుదల రోజున తాను ఎదుర్కునే ఒత్తిడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియచేసాడు. 

తన సినిమా విడుదల రోజున తాను ఎవర్ని కలవడానికి ఇష్టపడనని ఒక విధంగా చెప్పాలి అంటే తాను చచ్చిపోయే అంత స్టేజ్ కి వెళ్ళి పోతున్నట్లుగా విపరీతమైన వేదన పడుతూ ఆ టెన్షన్ లో విపరీతంగా నిద్రపోతాను అన్న విషయాన్ని బయట పెట్టాడు. తన మూవీ టాక్ పూర్తిగా తెలిసే వరకు తనను లేపవద్దని తన కుటుంబ సభ్యులకు తాను చెపుతాను అంటూ ‘బాహుబలి’ విషయంలో తాను మారుదామని ప్రయత్నించి పడ్డ కష్టాలను వివరించాడు. 

‘బాహుబలి’ విడుదల రోజున జనంలోకి వచ్చి తన మూవీ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని దియేటర్ వరకు వచ్చి టెన్షన్ తో కనీసం తన కారు కూడ దిగలేకపోయిన అప్పటి విషయాలు వివరిస్తూ శరీరం అంతా తనకు చెమటలు పడుతుంటే తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందేమో అన్న ఫీలింగ్ తనకు కలిగిన విషయాన్ని వివరించాడు. అయితే ఈ అలవాట్లు ఒక సినిమా హీరోకు పనికిరావు అని తెలిసినా తాను మారలేకపోతున్నాను అంటూ ‘సాహో’ విడుదల రోజున ఆ సినిమా టాక్ తెలిసే వరకు తాను ఎన్ని గంటలు పడుకుంటానో తనకే తెలియదు అంటూ ప్రభాస్ చెపుతున్న విషయాలు ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ హీరోల ఇన్ సెక్యూరిటీని సూచిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: