టాలీవుడ్ లో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా తో మంచి విజయం అందుకున్నారు.  ఆ తర్వాత వచ్చిన దేవదాస్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. బాక్సా ఫీస్ దగ్గర బకెట్ తన్నేసిన సినిమాలను సక్సెస్ మీట్ లు పెట్టి లేపడం అనేది ఎప్పటినుండో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న తంతు. దీనికి స్టార్ హీరోలు ఏమీ మినహాయింపు కాదు. తాజాగా విడుదలైన మన్మధుడు – 2 ప్రేక్షకులను ఎంత నిర్రశపర్చిందో అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా సినిమా ఫట్ అయితే బయటకు రాని నాగ్ ఈ చిత్రానికి ఇతర నిర్మాతల ఒత్తిడి వల్ల బయటకి వచ్చినట్టున్నాడు. దీంతో ఏం మాట్లాడాలో తెలియక మొత్తం గందరగోళం చేశాడు.


వివరాల్లోకి వెళితే నాగ్ సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ, తనవి ఇంతకు ముందు సినిమాలు ఎన్నో మొదట నెగటివ్ టాక్ తెచ్చుకున్నా… క్రమేపీ క్లాసిక్స్ గా మారాయని అన్నారు. ఈ విషయాన్ని మన్మధుడు మొదటి పార్ట్ కి సంబంధించి ఆయన ఇంతకు ముందే అన్నారు. అయితే ఈ సారి మాత్రం ఎప్పుడు కొత్తగా ట్రై చేసినా తనకి మొదట్లో అనుకూల ఫలితం రాలేదని దేని గురించి ఇలా మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు అందరికీ.


ఉన్న డౌట్లు కాస్తా తరువాత వ్యాఖ్యతో ముగించేసారు అక్కినేని నాగార్జున. తాను ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం లేదు అని అసలు విషయం చెప్పేశారు. దీంతో అందరూ ఆయన కవర్ చేస్తున్నారని అర్ధం చేసేసుకున్నారు. ఇలా కన్‌ఫ్యూజింగ్‌గా మాట్లాడేసి మన్మథుడు 2 సక్సెస్‌ మీట్‌ని ముగించేసాడు. బాక్సాఫీస్‌ పరంగా చూస్తే ఏకంగా కొబ్బరిమట్ట చిత్రమే ఒక థియేటర్లో దీనికన్నా ఎక్కువ సాధించగా… శని, ఆదివారాలలో కూడా వసూళ్లు బాగా తక్కువ వచ్చిన ఈ చిత్రం నిలదొక్కుకోవడం కష్టమేనని ట్రేడ్‌ విశ్లేషకులు తేల్చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: