పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో విజయ్ సినిమా ఖరారు అయినట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఇప్పటీకే చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. పూరి ..మహేష్ కు చెప్పిన జనగణమన సినిమానే విజయ్ తో తీస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం .. విజయ్ తో పూరి ఒక మాస్  మసాలా సినిమా తీయబోతున్నాడని తెలుస్తుంది. విజయ్ ఎలాగూ తెలంగాణ యాసలో చింపేస్తాడు కాబట్టి మాస్ సినిమా క్లిక్ అవుతుందని పూరి భావించారు. ఇస్మార్ట్ శంకర్ ఏ విధంగా అయితే బ్లాక్ బస్టర్ అయ్యిందో అదే ఫార్ములా ను పూరి .. విజయ్ సినిమాకు అప్లై చేయబోతున్నాడు. 


పూరి — విజయ్ కాంబినేషన్ లో సినిమాకు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మనే కోన సాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇష్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మనం చూశాము. ఇంకా తనలో ఆ ఫైర్ ఉందని మణిశర్మ నిరూపించారు. దీనితో మ్యూజిక్ డైరెక్టుగా మణిశర్మ నే ననీ ఫిక్స్ అయిపోవచ్చు. ఈ విషయంలో విజయ దేవరకొండ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 


ఇక హీరోయిన్ గా రష్మిక నే మళ్ళీ కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. విజయ్ అయితే రష్మిక అయితే బాగుంటుందని స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. దీనితో మళ్ళీ రష్మిక నే కొనసాగవచ్చు. అయితే విజయ దేవకొండ నటిస్తున్న సినిమా 'హీరో' ఇక ఆగిపోయినట్టేనని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ మళ్ళీ సినిమా మొదలవుతుందని చెబుతున్న అదేమీ లేదని విజయ్ వర్గాలు చెబుతున్నారు. ఇక పూరి ప్రతి సినిమాలో హీరోకి ఒక్కొక్క గెట్ అప్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ కు కూడా సరికొత్త గెట్ అప్ తయారు చేసే పనిలో పడ్డారు పూరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: