బన్నీ త్రివిక్రమ్ ల మూవీ మొదలై చాల కాలం అయినా ఈమూవీ టైటిల్ ప్రకటించే విషయంలో త్రివిక్రమ్ విపరీతమైన కన్ఫ్యూజన్ కు లోనవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా ఈ రెండు టైటిల్స్ పై త్రివిక్రమ్  పూర్తిగా సంతృప్తిగా లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

‘నేను నాన్న’ ‘అలకనంద’ అన్న టైటిల్స్ పై ఆలోచనలు కొనసాగినా ఈ రెండిటి పై కూడ బన్నీ త్రివిక్రమ్ లకు ఒక ఏకాభిప్రాయం ఏర్పడలేదు. ఈ పరిస్థితులలో ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఒక షాకింగ్ టైటిల్ త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి ‘వైకుంఠపురంలో’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. 

ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా తీస్తున్న త్రివిక్రమ్ తన ఆలోచనలకు అనుగుణంగా ఈ టైటిల్ ఫిక్స్ చేసాడు అని అంటున్నారు. ఈ మూవీ టైటిల్ ఫిక్స్ కావడంతో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను కూడ ఆగష్టు 15న విడుదల చేయబోతున్నారు. నాన్న సెంటిమెంట్ తో రూపొందుతున్న బన్నీ మూవీకి ‘వైకుంఠపురం’ అన్న టైటిల్ పెట్టడం వెనుక ఎదో ఒక లింక్ ఉండి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి ఈ మూవీలో టబు పాత్ర కీలకం కావడంతో మొదట్లో ఈ మూవీకి లేడీ ఓరియంటెడ్ టైటిల్ పెడదాము అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆలోచనలు మారిపోయి ‘వైకుంఠపురం’ వెలుగులోకి వచ్చింది .రాబోతున్న సంక్రాంతి వార్ కు రెడీ అవుతూ రాబోతున్న మహేష్ బన్నీల సినిమాలు రెండిటికి పూర్తి తెలుగు తనంతో కూడిన ‘సరిలేరు నీకవ్వరు’ వైకుంఠపురంలో’ టైటిల్స్ ఫిక్స్ కావడంతో తెలుగు టైటిల్స్ పట్ల పెరుగుతున్న మోజుకు ఇది సంకేతంగా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: