మీడియా సంచలనం శ్రీరెడ్డి సాధారణంగా ఒక హీరో గురించి ఎప్పుడు పాజిటివ్ గా ఆమె ఎప్పుడు మాట్లాడదు. ప్రతి హీరోలోని నెగిటివ్ విషయాల పై ఫోకస్ పెడుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రభాస్ గురించి స్పందించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలను హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్స్ ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది. 

‘ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌ గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను' అంటూ శ్రీరెడ్డి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఆమె ప్రభాస్ ను ఉద్దేసించి ‘డ్రీమ్ బాయ్'అంటూ చేసిన కామెంట్ కూడ ప్రభాస్ అభిమానుల మధ్య అత్యంత ఆశ్చర్యంగా మారాయి. 

వివాదాలకు గాసిప్పులకు రాజకీయాలకు చాల దూరంగా ఉండే ప్రభాస్ ను ఇష్టపడని వారు ఉండరు. అయితే అందరిలోనూ లోపాలు వెతికే శ్రీరెడ్డికి కూడ ప్రభాస్ ప్రవర్తన నచ్చడంతో అతడి వ్యవహార శైలి ఎంత వివాదరహితమో అర్ధం అవుతుంది. తన అభిమానులతో ‘డార్లింగ్’ అని పిలిపించుకునే ప్రభాస్ గురించి ఒక్క పెళ్ళి విషయంలో తప్ప మరెక్కడా గాసిప్పులు కనిపించవు. 

ప్రభాస్ వ్యక్తిత్వమే కాకుండా ప్రభాస్ అతిథి మర్యాదలు కూడ చాల షాకింగ్ గా ఉంటాయి. ‘సాహో’ సినిమాలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ ఒకసారి ప్రభాస్ తో తనకు హైదరాబాద్ బిర్యాని తినాలి అని ఉంది అని చెపితే ఆమె ఉంటున్న హోటల్ కు 27 రకాల బిర్యానీలు ఆమె కోసం పంపి శ్రద్దా కపూర్ మైండ్ బ్లాంక్ చేసిన విషయం తెలిసిందే. ఇన్ని పాజిటివ్ గుణాలు ఉన్నాయి కాబట్టే శ్రీరెడ్డికి కూడ ప్రభాస్ బాగా నచ్చాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: