ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు దర్శకుడు రాజమౌళి.  ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.  దాదాపు రూ. 300 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కుతోంది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కొంత వరకు పూరైంది.  


ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని యూనిట్ చెన్నై కు షిఫ్ట్ అయ్యింది.  అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.  ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నారు.  ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను స్పీడ్ గాషూట్ చేస్తున్నాడు రాజమౌళి.  


వీలైనంత త్వరగా ఎన్టీఆర్ పాత్రను కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.  ఎందుకు అంత స్పీడ్ గా ఎన్టీఆర్ పాత్రను షూట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు హీరోయిన్ సెట్ కాలేదు.  ఎన్టీఆర్ హీరోయిన్ కోసం విదేశీ అమ్మాయిని చూస్తున్నారు.  ఇద్దరు విదేశీ హీరోయిన్లను సెట్ చేసినా ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారు.  ఇప్పుడు మరో హీరోయిన్ కోసం రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు.  


ఇదిలా ఉంటె, ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 15 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేదు.  ఆగస్టు 15 వ తేదీన ఏదో ఒక అప్డేట్ ఆర్ఆర్ఆర్ నుంచి తప్పకుండా వస్తుంది.  అది ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అని అంటున్నారు.  ఒకవేళ ఎన్టీఆర్ కొమరం భీం కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారో లేదంటే ... ఎన్టీఆర్, చరణ్ ల లుక్ ను రిలీజ్ చేస్తారా..? లేదంటే సినిమా టైటిల్ ను ప్రకటిస్తారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: