యాక్షన్ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన సినిమా సాహో ఆగస్టు 30న విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. దాదాపు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఒకేసారి విడుదల అవటానికి అన్నిచోట్ల రంగం సిద్ధమైంది. ఇదేవిధంగా యూఎస్ లోనూ రికార్డు స్థాయిలో ఈ సినిమా విడుదల చేయడానికి అంతా రెడీ అయింది. ఎక్కువగా యూఎస్ లో ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని యూఎస్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా ప్రీమియర్ షో ని భారీగా ప్లాన్ చేశారు.


అయితే ఈ క్రమంలో ‘సాహో’ సినిమా యూనిట్ యూఎస్ లో వేయాల్సిన ప్రీమియర్ షో ని క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. అయితే కారణం చూస్తుంటే విషయం ఏంటో తెలియదు కానీ ముందు నుంచీ ప్లాన్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఏమి అర్ధంకాని సిట్యువేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రీమియర్ షో వేస్తే టాక్ ముందే బయిటకు వచ్చేస్తుంది. అలా టాక్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్తున్నారు. అన్ని చోట్ల నుంచీ ఒకేసారి టాక్ బయటకి వస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.


ఇలా చేయడం వల్ల సినిమా ఓపెనింగ్స్ నాడే రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్ట వచ్చని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షో వేసిన కొలది సోషల్ మీడియాలో అనవసరమైన రివ్యూలు రాస్తూ హిట్ అయిన సినిమాలను కూడా డివైడ్ టాక్ ఇటీవల దురుద్దేశంతో తీసుకు వస్తున్న నేపథ్యంలో సాహో సినిమా యూనిట్ ముందునుండి అటువంటివి సినిమా విషయంలో జరగకుండా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు అంచనాలు చాలానే పెట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: