డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న భీష్మ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో సెట్ లో హీరో నితిన్ తో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న ఫోటోలను మరియు కన్వర్జేషన్ లను డైరెక్టర్ వెంకీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వెంకీ కుడుముల ఏమని పోస్టు చేశారంటే ‘నేను నితిన్‌ అన్న డీప్‌ డిస్కషన్‌లో ఉన్నాం. వెనక రష్మిక ఏం చేస్తోందో మాకు తెలీదు’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు రష్మిక స్పందిస్తూ.. ‘ఏయ్‌.. సెట్స్‌లో మాకు తెలీకుండా మీ ఇద్దరూ ఏం చేస్తుంటారో నెటిజన్లకు కూడా చూపించమంటారా? మీ ఇద్దరి ఫొటోలు బయటపెట్టనా?’ అని ఫన్నీగా కామెంట్‌ చేశారు.


ఇందుకు వెంకీ ప్రతిస్పందిస్తూ.. ‘పోస్ట్‌ చెయ్. మేమిద్దరం ఏం చేసేవాళ్లమో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది’ అన్నారు. మధ్యలో నితిన్‌ కలగజేసుకుని.. ‘సెట్స్‌ లోపలైనా, బయటైనా మేం కేవలం పని గురించే మాట్లాడుకుంటాం. కానీ, వెంకీ.. మీరు మధ్యలో ఎవరితో ఫేస్‌టైంలో మాట్లాడుతుంటారు?’ అని అడిగారు.నితిన్‌ ట్వీట్‌కు రష్మిక సమాధానమిస్తూ.. ‘ఏయ్‌ నితిన్‌.. నువ్వాగు.


తెర వెనుక ఏం జరుగుతోందో నేను అందరికీ చూపిస్తాను. ఎప్పటికీ మేం సింగిలే రష్మిక సమాధానం వచ్చింది. అయితే దీనికి హీరో నితిన్ స్పందిస్తూ ఆ ట్యాగ్‌టైన్‌ కేవలం నాకు మాత్రమే సూటవుతుంది. నీకు వెంకీ, వెంకీకి నువ్వు తోడుగా ఉన్నారు’ అంటూ సరదాగా కాసేపు రష్మికా నితిన్ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నితిన్ అభిమానులు తొందరగా పెళ్లి చేసుకో అన్న ఇలాంటి మాటలు మనం పడక్కర్లేదు అని సలహా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: