సూపర్ స్టార్ ల కంటే కూడా సూపర్ స్టార్ ల పిల్లల మీద ఎప్పుడూ జనాలకి ఒక రకమైన ఇంటరెస్ట్ ఉంటూ ఉంటుంది . సినిమా హీరోల పిల్లలు అంటే అభిమానులకి చాలా ముద్దు, వారు ఒక చిన్న ఆట ఆడినా పాట పాడినా అభిమానులకి సంబరం అనే చెప్పాలి. ఒకప్పుడు సిసింద్రీ లాంటి సినిమా హిట్ అయ్యింది అంటే దానికి స్పస్తమైన కారణం అదే అని చెప్పక తప్పదు.



ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో టాప్ హీరో ఐన మహేశ్ బాబు కూతురు సితార వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన ముద్దుల , క్యూట్ డాన్స్ తో ఆమె ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు కూతురు ఒక్క పాట అనే కాదు అనేక సొంగ్స్ కి డాన్స్ చేస్తున్న వీడియో లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉంటే మహేశ్ అనేకసార్లు మై మరచిపోవడమే కాకుండా తన ఫాన్స్ కి కూడా షేర్ చేస్తూ ఉంటాడు అవే వీడియో లు. భవిష్యత్తు సూపర్ స్టార్ ఈమె అంటూ నెటిజన్ లు ఆ వీడియో లు చూసి పొగుడుతూ ఉంటే ఫాన్స్ ఫుల్ జోష్ మీద ఉంటారు కదా మరి. 




సితార యూట్యూబ్ లో ఏకంగా ఒక చానల్ నే మొదలు పెట్టేసింది . వంశీ పైడిపల్లి కూతూరు ఆద్య తో కలిసి ఆమె మొదలు పెట్టిన చానల్ కి పేరు A & S ని పెట్టింది కూడా.. ఈ చానల్ లో మొదట 3 మార్కర్స్ ఛాలెంజ్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు అప్పటి నుంచీ సబ్స్క్రైబర్ లు వెల్లువలా వస్తున్నారు. దాదాపు ఇరవై వేలమంది అప్పుడే ఈ చానల్ ని subscribe చేసుకున్నారు అంటే ఆమె రేంజ్ ఎంతో అర్ధం అవుతోంది మరి.




తాజా గా ఆమె మహర్షి లో పాలపిట్ట సాంగ్ కి డాన్స్ చేయగా ఆ వీడియో ని మహేశ్ భార్య ఇంస్టా లో పోస్ట్ చేయగా ఆ వీడియో కి బోలెడు వ్యూస్ మరి.. ఘట్టమనేని సీతారా మజాకా !!

మరింత సమాచారం తెలుసుకోండి: