టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మించిన సినిమా మన్మధుడు 2. కొన్నేళ్ల క్రితం నాగార్జున హీరోగా రూపొందిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా సరికొత్త కథ మరియు కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్. నిజానికి ఈ సినిమాకు సంబంధించి రిలీజయిన ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ ప్రోమోలు యూట్యూబ్ లో విడుదలై, ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. అయితే చివరకు విడుదల రోజున సినిమా చూడాలని ఎంతో ఉత్సాహంతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు, ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వడంలో చాలావరకు విఫలమైందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. 

సినిమాలో నాగార్జున గారి నటన మరియు రకుల్ సహా ఇతర క్యారెక్టర్స్ పోషించిన వారు అందరూ ఎంతో అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేసారని, ఇక ఈ సినిమా కోసం రాహుల్ ఒక ఫ్రెంచ్ సినిమా కథను కొనుగోలు చేసి మరీ తీయడం జరిగింది. ఇక సినిమాలో నాగ్ పాత్ర పై కూడా కొంత విమర్శలు వినపడుతున్నాయి, సినిమాలో నాగార్జున ఎంతో యంగ్ గా కనపడినప్పటికీ, కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీస్ చూడడానికి అభ్యంతరకరంగా ఉన్నాయని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. ఇకపోతే తొలిరోజు మిక్స్డ్ టాక్ తో ప్రారంభమయిన ఈ సినిమా, ప్రస్తుతం చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయమై మొన్న నాగార్జున మాట్లాడుతూ, ఇదివరకు తాను నటించిన శివ, అన్నమయ్య వంటి సినిమాలకు కూడా మొదట్లో ఇలానే కొంత నెగటివిటీ వచ్చిందని, అయితే అవి మెల్లగా పుంజుకుని చివరకు మంచి హిట్స్ గా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఇక ఇప్పటివరకు గడిచిన నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ. 8.65 కోట్లు కొల్లగొట్టిందని, ఇక రూ.20 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా, ఇంకా మరొక రూ.12 కోట్లవరకు రాబడితేనేకాని బ్రేక్ ఈవెన్ చేరుకోదని, అంతకు మించి కనుక కలెక్షన్ సాదిస్తేనేకాని బయ్యర్లు లాభాలు చూడరని అంటున్నారు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడమే చాలా కష్టం అంటున్నారు విశ్లేషకులు. అయితే రాబోయే రోజుల్లో ఈ సినిమా నాగార్జున గారి మాటను ఎంతవరకు నిజం చేసి ఎంతవరకు హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: