రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. అందుకోసం అయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమా ప్రమోషన్ కు మరింత హైప్ పెంచుతున్నాడు. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో వస్తున్నా సినిమా కనుక ఈ సినిమాపై అందరు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మొదట్నుండి ఈ సినిమా లోని స్పెషల్  పోస్టర్ లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఒక బజ్ క్రియేట్ చేశారు ఆ చిత్ర యూనిట్.                                                              


ఇకపోతే మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాను పీక్స్ కి తీసుకెళ్ళింది. బాలీవుడ్, టాలీవుడ్ మీడియా లను పలకరించిన ప్రభాస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అలా ఆయనకు తన పెళ్లి గురించిన ఒక ప్రశ్న ఎదురవ్వగా, అవన్నీ కేవలం రూమర్స్ అంటూ కొట్టిపడేశారు.                                   


వివరాల్లోకి వెళితే.. తానూ అనుష్కతో డేట్ లో ఉన్నడంటూ అంటూ వస్తున్నా వదంతులలో ఎటువంటి నిజం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజిగా ఉన్న డార్లింగ్ జిల్ ఫెమ్ రాధాకృష్ణ కాంబినేషన్ లో  ఒక రొమాంటిక్ సినిమాను చేయబోతున్నాడని సమాచారం. కాని, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయం పై ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. ఇంతకీ ఈ రెబల్ స్టార్ కు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యాలు ఉన్నాయో లేదో తెలియడం లేదు.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: