రాజమౌళి, ప్రభాస్ ల మధ్య  అనుభంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ ఇద్దరు మన  తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. అయితే తనకు సంబంధం లేకపోయినా పలు తెలుగు సినిమాల పై రాజమౌళి ట్వీట్లు చేస్తూ ఆయా చిత్రబృందాలకు సపోర్ట్ చేస్తుంటారు.  కానీ ప్రభాస్ హీరోగా   అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న  “సాహో” చిత్రం  ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. పైగా  ఇప్పటికే విడుదల చేసిన టీజర్  ట్రైలర్లకు అద్భుత స్పందన వచ్చింది. దాంతో  తెలుగు సినీపరిశ్రమ నుండే కాకుండా  దేశవ్యాప్తంగా ఉన్న సినీ తారలు మరియు అగ్ర దర్శకులు అంతా  'సాహో' సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.  తెలుగు ఇండస్ట్రీ నుంచి బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో దేశం అంతటా మాట్లాడుకునేలా సాహో సినిమా చేసిందని మన దగ్గర నటులు కూడా తెలిపారు.  కానీ   రాజమౌళి నుంచి మాత్రం ఇంకా  ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం  పై  రాజమౌళి ఇంకా మాట్లాడకపోవడం కాస్త ఆశ్చర్యకరమే. మరి రాజమౌళి సినిమా విడుదల సమయంలో అయినా  తన స్పందనను తెలియజేస్తారేమో చూడాలి.   


కాగా ఈ సినిమా బడ్జెట్‌ అక్షరాల రూ. 350 కోట్లు అని..  ఇది ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్ కాదని..  ఇది ప్రస్తుతం నడిచే కథ అని,  సినిమాలో కొన్ని పార్ట్స్‌ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయని తెలుస్తోంది.  కాగా ప్రస్తుతం సాహో  ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు.  టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అయితే ఈ సినిమా పై మాత్రం  కొంతమంది నెగిటివ్ టాక్ వచ్చేలా పుకార్లు  పుట్టిస్తున్నారు.  రాజమౌళి  కావాలనే ఈ సినిమాను లైట్ తీసుకున్నారని రకరకాల వార్తలు పుట్టించేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి  రాజమౌళికి తెలుసు అని సినిమా ఆయనకు నచ్చలేదని, అందుకే రాజమౌళి ఈ సినిమా గురించి పాజిటివ్ గా మెసేజ్ పెట్టడం ఇష్టం లేక  ఈ సినిమా గురించి ఎలాంటి కామెంట్ చెయ్యలేదని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: