న్యాచురల్ స్టార్ నాని కథనాయకుడిగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడర్. నాని నటించిన సూపర్ హిట్ చిత్రం జెర్సీ తర్వాత వెంటనే గ్యాంగ్ లీడర్ సినిమా అప్డేట్ వస్తుంది అని ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ షూటింగ్ ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి తప్ప అప్డేట్స్ ఎం రాలేదు. ఈ నేపథ్యంలోనే నాని ప్రీ లుక్, ఫస్ట్ లుక్‌, ఫస్ట్‌ సాంగ్‌, టీజర్‌ను రిలీజ్ చేశారు. 


ఇప్పటికే విడుదల చేసిన గ్యాంగ్ లీడర్ టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ లీడర్ నుంచి 'హొయినా హొయినా' అనే పాటను స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న సాయింత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ లో గ్యాంగ్ లీడర్ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ప్రకటించారు. దీంతో అభిమానులంతా సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. 


గ్యాంగ్ లీడర్ తో పాటు వి చిత్రంలో కూడా నాని కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. నాని నటిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా నాని గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: