2005లో దేవ‌దాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ త‌ర్వాత తెలుగులో ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక్క‌డ వ‌రుస పెట్టి స్టార్ హీరోలు, కుర్ర హీరోల‌తో న‌టిస్తూ రెండేళ్లుగా ఇండ‌స్ట్రీని ఏలేసింది. ఇలియానా అంటే తెలుగు యువ‌త పిచ్చెక్కిపోయేది. ఆమె నాజూకు న‌డుము ఒంపులు చూసేందుకే థియేట‌ర్ల‌కు యువ‌త క్యూ క‌ట్టేవారు. 


పోకిరి సినిమా త‌ర్వాత ఆమె ద‌శ ఒక్క‌సారిగా తిరిగిపోయింది. వ‌రుస పెట్టి ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మ‌హేష్‌బాబు, ర‌వితేజ లాంటి హీరోల‌తో వ‌రుస పెట్టి ఛాన్సుల మీద ఛాన్సులు కొట్టేసింది. ఇక్క‌డ ఫామ్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిపోవాల‌న్న ఆశ‌తో అక్క‌డ‌కు వెళ్లి బొక్క బోర్లాప‌డింది. అదే టైంలో ఆమె త‌న ప్రియుడు, ఆస్ట్రేలియ‌న్ ఫొటో గ్రాఫ‌ర్ అయిన ఐ.ఆండ్రూతో ప్రేమాయ‌ణంతో మునిగిపోవ‌డం, బోల్డ్ డైలాగ్స్‌తో వార్త‌ల్లో హాట్ హాట్‌గా మారిపోయింది. 


ఇక్క‌డ ఫామ్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌కు చెక్కేసిన ఇలియానాకు అక్క‌డ కెరీర్ మాత్రం రివ‌ర్స్ అయ్యింది. బాలీవుడ్‌లో ఆమోకు కాలం క‌లిసి రాలేదు. వ‌రుస పెట్టి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ త‌ర్వాత తిరిగి టాలీవుడ్‌లోకి వ‌చ్చి ఇక్క‌డ హీరోయిన్‌గా రాణించాల‌ని అనుకున్నా మ‌న తెలుగు నిర్మాత‌లు ఆ త‌ర్వాత ఆమెను ప‌ట్టించుకోలేదు. ఇక తెలుగులో చాలా రోజుల త‌ర్వాత గ‌తేడాది ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో త‌ళుక్కుమ‌న్నా ఉప‌యోగం లేకుండా పోయింది. 


ఇక ఇప్పుడు ఆమె హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. చాలా రోజుల తర్వాత నటి ఇలియాన బికినీ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఓ షిప్ పై ఎడమ చేయి పైకెతి సూర్యుడి వైపు చూస్తున్నట్లు ఫోజ్ ఇచ్చింది. ఈ పిక్ లో ఇలియాన సినిమా లో అడుగు పెట్టినప్పుడు మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు అదే అందంతో మెరిసిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: