దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ప్రతిష్ఠను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళారు. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మరో భారీ సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నిర్మాత, నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇంకా కొన్ని గంటలలో భారత స్వాతంత్ర  దినోత్సవం ఉన్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' పై ఏదైనా ఆసక్తికర అప్డేట్ ఇస్తారా? లేదా? అని అటు సినీ అభిమానులతో పాటు, ఇటు తారక్, చరణ్ ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరో ఒకరి లుక్, లేదా ఇద్దరి లుక్ విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో అప్పుడే ఓ పుకారు మొదలైపోయింది. ఆగస్టు 15 అనే పండుగ దేశానికి, దేశభక్తికి సంబంధించి కావడం తోపాటు, 'ఆర్ ఆర్ ఆర్' కూడా దేశభక్తి కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అవడంతో ఎలాగైనా ఎదో ఒక అప్డేట్ రాజమౌళి ఇవ్వబోతున్నారని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ విడుదల చేయబోతున్నారని ఎక్కువగా వినిపించింది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా దాదాపు సంవత్సరం సమయం ఉండటంతో అప్పుడే రాజమౌళి వీళ్ళ పాత్రలు పరిచయం చేస్తారా? అనే అనుమానం ప్రేక్షకుల్లో మొదలైంది. కానీ కొంతమంది మాత్రం రాజమౌళి సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.

డి వి వి దానయ్య నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందిస్తుండగా...బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్,అలియా భట్,సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఇక ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడని, దానితో పాటుగా మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమాలలో నటిస్తాడని ప్రచారం సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: