బాహుబలి.. తెలుగు సినిమా మార్కెట్ ను అమాంతం పెంచిన సినిమా.. పదుల కోట్ల నుంచి తెలుగు సినిమా రేంజ్ ను వందల కోట్లకు చేర్చిన సినిమా.. భారతదేశమే అబ్బురపడి టాలీవుడ్ వైపు తిరిగేలా చేసిన సినిమా. అయితే బాహుబలిని మించిన సినిమాలు తీయగలమని పవన్ కల్యాణ్ అంటున్నారు.


తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారని... బాహుబలి వంటి సినిమాలు వచ్చినా గానీ, ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదని పవన్ అన్నారు. అదిగానీ మనం అర్ధం చేసుకోగలిగితే చాలా గొప్ప సినిమాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు శ్రీ తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర – పరిణామం’ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం. అలా తీయాలంటే ఇలాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి.ముందుగా ఇలాంటి పుస్తకాన్ని రాసిన సీనియర్ పాత్రికేయులు శ్రీ తెలకపల్లి రవి గారికి అభినందనలు. రెండేళ్లపాటు శ్రమించి ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషాన్ని కలుగచేస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


పరుచూరి సోదరుల గొప్పతనం ఏంటంటే ఒక సామాజిక సమస్యను కమర్షియల్ విలువలు ఉంటూనే మనం ప్రభావితం అయ్యేలా రాయగలరు. అలాంటి రచన శక్తి అందరికి రాదు. అదొక అరుదైన కళ. సావిత్రి గారు, ఎస్వీ రంగారావు గారు ఎవరో ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియదు. సావిత్రిగారి బయోపిక్ తీస్తేనేగానీ ఆమె సామర్ధ్యం, కష్టాన్ని మనం గుర్తించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: