విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్. తండ్రి లాగానే బహుముఖీయమైన ప్రతిభ ఈ అమ్మడు సొంతం. పాడుతుంది. నటిస్తుంది.  మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది. ఇంకా ఎన్నో కళలు ఉన్నా ఈ ముద్దు గుమ్మ నటిగానూ తన ప్రతిభ రుజువు చేసుకుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పక్కన శ్రుతి హీరోయిన్ కాకపోతే ఆ పాత్ర అంతలా పండేది కాదనే వారూ ఉన్నారు.


ఇక శ్రుతిలో మరో గొప్ప విశేషం ఉంది. తన తండ్రి కమల్ మాదిరిగానే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లుగా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. అందులో ఏ మాత్రం ఆలోచించదు. తాను ఎంతో స్వేచ్చగా ఉన్నానని చెబుతున్న శ్రుతి పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది.   తనకు అన్నీ ఉన్నపుడు మరో కొత్త వ్యక్తికి జీవితంలో ఆహ్వానించడం  ఎందుకు అంటోంది.


నిజంగా చెప్పాలంటే తనకు పెళ్ళి అంటే భయమని శ్రుతి చెబుతోంది. వచ్చే వాడు ఎలాంటి వాడో ఏంటో అన్న ఆలోచనలు ఎపుడూ ఉంటాయని శ్రుతి అంటోంది. ఇక పెళ్ళి అంటూ చేసుకోవాలంటే  తనలో ఉన్న ఆ భయం తగ్గాలని శ్రురి పేర్కొంది. తాను చేసుకోబోయే వాడు దయ, జాలి కలిగి ఉండాలని, అన్నింటికీ మించి నిజాయతీపరుడు అయి ఉండాలని ఆమె అంటున్నారు.


ఇక తన భర్తకు వీటితో పాటు గడ్డం ఉండాలని, దాన్ని ఎపుడూ తీసివేస్తే తాను వూరుకోనని సరదాగా చెబుతోంది. తమ ఇంట్లో బ్లేడ్లు, రేసర్లు జాగ్రత్త పడతానని, ట్రిమ్మింగ్ కూడా కనీసం చేసుకోనివ్వనని  కాబోయే భర్త గడ్డం గురించి చెబుతోంది. మొత్తానికి శ్రుతి షరతులు బాగానే ఉన్నాయి. వీటిని లెక్కేసుకుని శ్రుతికి  కాబోయే ఆ భర్త ఎవరో ముందుకు వస్తే బాగుంటుందేమో. మొత్తానికి మంచి మొగుడు రావాలని మాత్రం కోరుకుందాం.




మరింత సమాచారం తెలుసుకోండి: