అందాల కాశ్మీర్ కోసం డెబ్బయ్యేళ్ళుగా పాక్, భారత్ మధ్య యుధ్ధం నడిచిన సంగతి తెలిస్తే దాని విలువ ఏంటో తెలుస్తుంది. భారత మాత సిగలోని కుంకుమ పువ్వుగా కాశ్మీర్ ని చెప్పాలి. అక్కడ బాగులేనిది ఏదీ ఉండదు, మంచుతో పాటు, మంచితనానికి కూడా పెట్టింది పేరు. అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కాశ్మీర్ కి ఇంకా ముక్కుపచ్చలారలేదు. ఎప్పటికీ పదహారేళ్ళ కన్నె పిల్లగానే కాశ్మీర్ కనిపిస్తుంది.


కాశ్మీర్లో అప్పట్లో అంటే 60,70 దశకల్లో సినిమాలు తీసేందుకు నిర్మాతలు పోటీ పడేవారు. హీరోలు కూడా రోమాంటిక్ సాంగ్స్ తీయాలంటే కాశ్మీర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అందాల‌ కాశ్మీరంలో పాటలు మరింత అందంగా వచ్చేవి ఒక జనరేషన్  ఆడియన్స్  హిందీ  సినిమాలు చూసేవారంటే పూర్తిగా కాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకేనని అంటారు.


అటువంటి కాశ్మీర్లో 1980 దాశకం తరువాత సినిమాల షూటింగులు తగ్గిపోయాయి. ఉగ్రవాదం దిగుమతి కావడంతో ఎక్కడ చూసినా హింస ప్రజ్వరిల్లి కాశ్మీర్ వైపు వెళ్ళడం మానేశారు. అయితే టాలీవుడ్ కి కూడా కాశ్మీర్ తో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు శ్రీవారి ముచ్చట్లు సినిమాల్లోని పాటలు కాశ్మీర్లో చిత్రీకరించారు.


అలాగే అన్న నందమూరి  శ్రుంగార రాముడు మొత్తం సాంగ్స్, చాలావరకూ సినిమా కూడా కాశ్మీర్లో జరిగింది. శోభన్ బాబు మూవీ కన్నవారి కలలు లో సాంగ్, సీన్స్ చాలా  కాశ్మీర్లో తీశారు. ఇలా పాత హీరోలంతా కాశ్మీర్లోనే తమ షూటింగులు జరుపుకున్నారు. ఇపుడు మళ్ళీ కాశ్మీర్లో షూటింగులకు టాలీవుడ్ ఆశగా ఎదురుచూస్తోంది.


ప్రపంచంలో ఎక్కడా లేని అందాలు, లొకేషన్లు కాశ్మీర్లో ఉన్నాయి. దాంతో సినిమాలు తీసేందుకు ఇపుడు జనం పరుగులు తీస్తున్నారు. పూర్తిగా కాశ్మీర్ కంట్రోల్ లోకి వచ్చిన మరుక్షణం టాలీవుడ్ తో సహా బాలీవుడ్ కోలీవుడ్ కెమెరలాతో కాశ్మీర్ పై దాడి చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి కాశ్మీర్ కాచుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: