బిగ్ బాస్ లో టాస్క్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. నేను టాస్క్ లు చేయను అనే వారికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వడం మామూలే. అయితే టాస్క్ లలో శ్రీముఖి ప్రవర్తన వింతగా కనిపిస్తుంది. మిగతా టైంలో ఆమె అందరితో కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ టాస్క్ అనగానే తన బిహేవియర్ టోటల్ గా మారిపోతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చాలా వరకు ఫిజికల్ టాస్క్ లే. 


ఆ టాస్క్ లో భాగంగా ఒకరిని పట్టుకోవడం జరుగుతుంది. నన్నెవరూ టచ్ చేయకూడదు అంటే కుదరదు. అసలు టచ్ చేయకూడదనుకుంటే టాస్క్ లో పార్టిసిపేట్ చేయకూడదు.నిన్న జరిగిన ఎపిసోడ్ లో శ్రీముఖి ఇదే తప్పు చేసింది. తన దగ్గర ఉన్న డ్రాగన్ ఎగ్ ని లాక్కోవాలని రాహుల్ ప్రయత్నిస్తుంటే, నన్ను టచ్ చేస్తే బాగుండదు అంటూ అతన్ని దూరం పెట్టింది.  ఇప్పటికే రాహుల్ మీద ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. దీంతో అతను చాలా సేఫ్ గా గేమ్ ఆడాల్సి వచ్చింది.


చివరికి ఎలాగోలా శ్రీముఖి దగ్గర డ్రాగన్ ఎగ్ లాక్కున్నాడు. దొంగా పోలీస్ టాస్క్ లో కూడా శ్రీముఖి ఇలానే చేసింది. తనని ఎవరూ టచ్ చేయొద్దని చెప్పింది. ఈ విషయంలో రాహుల్ కి శ్రీముఖి కి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అయితే శ్రీముఖి ప్రతీసారి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. ఆమె హౌస్ లో వుమెన్ కార్డ్ ప్లే చేయడం బాలేదని, గత సీజన్ లో భానుశ్రీ, తేజస్వి లు ఇలా చేయడం వల్లే ఇంటి నుండి వెళ్ళిపోయారని...గుర్తుచేస్తున్నారు.
 
కావాలని ఎవరూ టచ్ చేయరు. ఒకవేళ అలా చేస్తే అప్పుడు ఆమె వాదనకి ఒక అర్థం ఉంటుంది. నిజంగా అలాంటిది జరిగితే నాగార్జున గారు అస్సలు ఊరుకోరు. పోయిన ఆదివారం ఏం జరిగిందో అందరం చూసాం. ఈ వారం నామినేషన్ లో ఉన్న శ్రీముఖి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇలాగే ఉంటే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ముందు ముందు శ్రీముఖి తన ప్రవర్తనని మార్చుకుంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: