కోలీవుడ్ లో స్టార్ హీరోలు ,హీరోయిన్లు తాము నటిస్తున్న సినిమాల షూటింగ్ ను పూర్తి చేశాక ఆసినిమాకు పనిచేసిన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు  గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇవ్వడం ఎప్పటినుండో ఆనవాయితీగా వస్తుంది.  అందులో భాగంగా ఇటీవల పందెం కోడి 2 షూటింగ్ ను పూర్తి చేసి కీర్తి సురేష్ అలాగే మిస్టర్ లోకల్ సమయంలో నయనతార , ఎన్ జి కె షూటింగ్ ను పూర్తి చేసి సూర్య ఆ సినిమాలకు పనిచేసిన స్టాఫ్ కు గోల్డ్ కాయిన్స్ ను బహుమతిగా ఇచ్చారు. 


తాజాగా స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఈజాబితాలో చేరిపోయాడు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం బిగిల్. నిన్నటి తో ఈసినిమా చివరి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు విజయ్. తన పాత్ర తాలుకు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆ సినిమా కు పనిచేస్తున్న సుమారు 400 మంది నటీనటులకు అలాగే సాంకేతిక నిపుణులకు గోల్డ్ రింగ్స్ ను కానుకగా ఇచ్చాడు విజయ్. 


అట్లీ డైరెక్షన్ లో  స్పోర్ట్స్  డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్  ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.  ఇప్పటికే సినిమా షూటింగ్ 95శాతం కంప్లీట్ అయ్యింది.  భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక ఇంతకుముందు  అట్లీ -విజయ్ కాంబినేషన్ లో వచ్చిన  తెరి , మెర్సల్ ఒకదానిని మించి ఒకటి విజయం సాధించడం తో  బిగిల్ ఫై భారీ అంచనాలు  నెలకొన్నాయి. ఈ చిత్రం దీపావళి కానుకగా  విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: