మరో రెండు వారాల్లో 350 కోట్ల భారీ బడ్జెట్ తో టాలీవుడ్లో విడుదల కాబోతున్న సినిమా సాహో. ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాహో టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ నెల 18వ తేదీన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుంది. దాదాపు కోటిన్నర రుపాయలతో ఈ ఈవెంట్ జరుపుతున్నారని సమాచారం. 
 
సాహో ట్రైలర్ విడుదలైనప్పటి నుండి రాజమౌళి ఈ సినిమాపై స్పందించటం లేదని వార్తలు వస్తున్నాయి. కానీ రాజమౌళి ఇప్పటికే సాహో సినిమా మొత్తం చూసాడట. యువి క్రియేషన్స్ నిర్మాతలు సాహో సినిమాను రాజమౌళికి చూపించి సలహాలు ఇవ్వమని అడిగారట. నిజానికి సాహో సినిమా రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు వచ్చిందట. రాజమౌళి సినిమా మొత్తం చూసి కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని తొలగించమని నిర్మాతలకు సూచించాడని తెలుస్తోంది. 
 
రాజమౌళి సూచనలతో సాహో సినిమా నిడివిని 18 నిమిషాలు తగ్గించారట నిర్మాతలు. ప్రస్తుతం సాహో సినిమా నిడివి 2 గంటల 52 నిమిషాలకు లాక్ అయినట్లు సమాచారం. రన్ రాజా రన్ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా సాహో. ఈ సినిమాను సుజీత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. ట్రైలర్ హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. 
 
దాదాపు 100 కోట్ల రుపాయలు ప్రభాస్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ క్రింద తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. బాహుబలి, బాహుబలి2, సాహో సినిమాల వలన ప్రభాస్ కెరీర్లో సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువ వస్తోంది. అందువలన ప్రభాస్ సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటానని మీడియాతో తెలిపాడు. సాహో తెలుగు, తమిళం, మలయాళం శాటిలైట్, డిజిటల్ హక్కులు 60 కోట్ల రుపాయలకు అమ్మారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: