భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని కొంత మంది సినీతారలు ఉన్నారు.  తెలుగు లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీరంగారావు..తమిళ్ లో ఎంజీఆర్, జెమినీ గణేషన్, బాలీవుడ్ లో రాజ్ కపూర్,మధుబాల,దేవానంద్..కన్నడ నాట రాజ్ కుమార్ ఇలా ఎంతో మంది నటులు సినీ చరిత్రలో ఎప్పటీ జీవించే ఉంటారు. అలాంటి వారి లీస్ట్ లో చేరిపోయారు అందాలరాశి శ్రీదేవి.  చిన్నతనంలోనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తన పదహారో ఏట ‘పదహారేళ్లవయసు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. 

అప్పటి వరకు బాలనటిగా నటించిన హీరోలతో హీరోయిన్ గా నటిస్తూ వారికే గట్టి పోటీ ఇచ్చింది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో స్టెప్పులేసిన శ్రీదేవి వారి తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో కూడా నటించింది.  ఎప్పుడూ ఎవర్ గ్రీన్ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి తెలుగు లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 

తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి. అలాంటి శ్రీదేవి అకస్మాత్తుగా కాలం చేయడం అందరి హృదయాలు కలచి వేసింది.  అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని, తన అభిమానులను విడిచి వెళ్లి సంవత్సరం దాటిపోయిన ఆ విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈ సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనికపూర్‌ అనుమతితో పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్‌ రాస్తున్నారు. ‘శ్రీదేవి : గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌’ పేరు తో ఈ పుస్తకం రాబోతుందట. 

ఓ అభిమానిగా నేను ఎప్పుడు శ్రీదేవిని ఆరాధించేవాడిని..శ్రీదేవి జీవితాన్ని పూర్తిగా తెలుసుకోవలనుకునే ఫ్యాన్స్ ఈ పుస్తం చదివితే ఆమె జీవితం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందంటురు రచయిత  సత్యార్థ నాయక్‌.  


మరింత సమాచారం తెలుసుకోండి: