నా  పేరు సూర్య తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19 వ చిత్రంలో నటిస్తున్నాడు.  కాగా ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను  ఆగస్టు 15న   రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  అయితే దానికంటే ముందే  ఈటైటిల్ లీక్ అయ్యింది.   ఈసినిమాకు  'అల వైకుంఠపురంలో' అనే టైటిల్ ఖరారు చేశారని.. నిన్నటి నుండి  ఈన్యూస్ సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతుంది.  


 ఇక ఈ టైటిల్ విషయానికి వస్తే  పోతన రచించిన మహా భాగవతంలో గజేంద్ర మోక్షంలోని 'ఆల వైకుంఠపురంబులో' అనే పద్యం నుండి  ఈ టైటిల్ ను తీసుకున్నాడట త్రివిక్రమ్.  ఏది ఏమైనా ఒకవేళ ఈసినిమాకు  టైటిల్ అదే అయితే చాలా మంది కి  ఈ పద్యం గురించి  తెలిసేలాచేసినవారవుతారు త్రివిక్రమ్.  మరి  ఈసినిమా కు  ఆ టైటిల్ కు లింక్ ఏంటో తెలియాలంటే మాత్రం సినిమా విడుదలవరకు  వేచి చూడాల్సిందే. ఇక త్రివిక్రమ్ 'అ ఆ' సినిమానుండి  అ టైటిల్ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు.  ఈసినిమా తరువాత ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' కు  కుడా అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడు. ఫలితంగా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు బన్నీ సినిమాకు కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు.  


ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా  సీనియర్ నటి టబు ,ప్రముఖ  మలయాళీ నటుడు జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు  కీలక పాత్రల్లో  కనిపించనున్నారు.   తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్,  గీతా ఆర్ట్స్ బ్యానర్ల ఫై రాధాకృష్ణ , అల్లు అరవింద్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: